బాలీవుడ్‌ ఇండస్ట్రీ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే సినీ ప్రముఖుల ఇళ్లలో వరుసగా కరోనా కేసులు బయటపడుతుండగా తాజాగా మరణాలు కూడా షాక్‌ ఇస్తున్నాయి. ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కరోనాతో మృతి చెందగా తాజాగా బాలీవుడ్‌లో మరో కరోనా మరణం నమోదైంది. ప్రముఖ నిర్మాత అనిల్ సూరి కరోనాతో మృతి చెందిన వార్త సినీ రంగాన్ని కుదిపేస్తోంది. ఈ విషయాన్ని ఆయన సోదరుడు రాజీవ్‌ సూరి వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ.. `అనిల్ సూరి జూన్‌ 2 నుంచి హై ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఒక్క రోజులోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయన్న లీలావతి, హిందూజా ఆసుపత్రులకు తీసుకెళ్లేగా వారు ఆయన్ను చేర్చుకునేందుకు నిరాకరించారు. ఇలా ఆలస్యం కావటంతో చివరకు ఓ మల్టీ స్పెషలిటీ ఆసుపత్రిలో చేర్చినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. చివరకు చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన కన్నుమూశారు.

శుక్రవారం ఉదయం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. నిర్మాత అనిల్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనీల్‌.. రాజ్‌కుమార్‌, రేఖ కాంబినేషన్‌లో  కర్మ యోగి, రాజ్ తిలక్‌ లాంటి సినిమాలు రూపొందించారు. అనిత్‌ తో పాటు అదే రోజు ప్రముఖ నిర్మాత బసు ఛటర్జీ కూడా మృతి చెందటంతో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. 
Bollywood producer Anil Suri succumbs to COVID-19 after being ...