డ్రగ్స్ మత్తులో సినీ లోకం

Bollywood movies that are high on drugs and smoking
Highlights

నేడు ప్రపంచ డ్రగ్స్ డే

డ్రగ్స్.. ఇదో మత్తు పదార్థం. ఒక్కసారి అలవాటు అయితే.. దానిని మానేయడం చాలా కష్టం. ఈ డ్రగ్స్ మత్తులో చిక్కుకొని చిత్తు అయిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ యువత వరకు చాలా మందే ఈ డ్రగ్స్ కి బానిసలుగా మారారు. ఇప్పుడు ఇవన్నీ మాకు ఎందుకు చెబుతున్నారు అని అంటారా..? ఈ రోజు ప్రపంచ డ్రగ్స్ డే. కాబట్టి.. సినిమాల్లో విపరీతంగా డ్రగ్స్, మద్యం తదితర అంశాలను ప్రస్తావించిన కొన్ని బాలీవుడ్ సినిమాలపై ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన ఫ్యాషన్ సినిమా చూసే ఉంటారు. మోడలింగ్ ప్రపంచాన్ని చాలా దగ్గర నుంచి చూపించిన సినిమా ఇది.  ప్రియాంక, కంగనా మొయిన్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమాకి మధు బండార్కర్ దర్శకత్వం వహించారు. ఇందులో సూపర్ మోడల్ అయిన ప్రియాంక డ్రగ్స్ కి అలవాటు పడుతుంది. చెయిన్ స్మోకర్ కూడా. అంతేకాదు ఈ సినిమాలో ప్రియాంక, కంగనారనౌత్ ల రూమ్స్ లలో కొకైన్ కూడా దొరుకుతుంది.

దమ్ మారే దమ్.. అభిషేక్ బచ్చన్, రానా దగ్గుబాటి, బిపాషా బసు లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి రోహన్ సిప్పి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కించినదే. చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ.. స్మోక్ చేస్తూ కనిపిస్తారు.

సైతాన్.. ఈ సినిమాలో కొందరు యువత మత్తులో కారు నడిపి.. అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటారు. ఈ నేపథ్యంలో సినిమా నడుస్తుంది. అనురాగ్ కశ్యప్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించగా..కల్కి కొచ్చిన్ ప్రధాన పాత్ర పోషించారు.

గో గోవా గాన్...ఇదొక ఇండియన్ జుంబాబ్వే సినిమా. దీనిలో కునాల్, వీర్ దాస్, ఆనంద్ తివారీలు కీలక పాత్రలు పోషించారు. ఈ ముగ్గురు స్నేహితులు పార్టీ కోసం గోవా వెళతారు. అక్కడ డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తారు. ఈ నేపథ్యంలో సినిమా సాగుతుంది.

గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్...అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాఫియా నేపథ్యంలో సాగుతుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్ర పోషించారు. దీనిలో కూడా ప్రధాన పాత్రలు ఎక్కువగా మత్తు పదార్థాలు తీసుకోవడం లాంటి సన్నివేశాలు ఉంటాయి.

రాగినీ ఎంఎంఎస్ 2.. ఈ సినిమాలో సంద్యా మ్రిదుల్, సన్నీ లియోన్  ప్రదాన పాత్రలు పోషించారు. నటీనటులు స్మోక్ చేయడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయి.


హీరోయిన్.. ఈ సినిమాలో కరీనా కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బోల్డ్ గా కనిపించిన కరీనా.. చెయిన్ స్మోకర్ , ఆల్కహాలిక్ గా కనపడతారు. 

ఉడ్తా పంజాబ్.. ఈ సినిమా కూడా డ్రగ్స్ నేపథ్యంలోనే సాగుతుంది. కాకపోతే ఇందులో డ్రగ్స్ కి బానిసలైన పలువురి నేపథ్యాన్ని వివరించారు. ఇక అనుష్క శర్మ కూడా ఎన్ హెచ్ 10 సినిమాలో స్మోక్ చేస్తూ కనపడుతుంది. 

loader