విలక్షణ నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీ శకుంతలా దేవి. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమా ట్రైలర్‌పై అక్షయ్‌ కుమార్‌ సహా బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఎంతో ప్రామిసింగ్ గా ఉన్న ఈ మూవీ ట్రైలర్‌పై బాలీవుడ్‌ లో ప్రతీ ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్క్రీన్‌ మీద కనిపిస్తున్న శకుంతలా దేవికి, రియలల్‌ లైఫ్‌ శకుంతలా దేవికి తేడా పోల్చుకోలేకపోతున్నాం అంటూ కామెంట్‌లు చేస్తున్నారు బాలీవుడ్‌ ప్రముఖులు.

విద్యాబాలన్‌తో కలిసి మిషన్‌ మంగళ్ సినిమాలో నటించిన అక్షయ్‌ కుమార్‌, శకుంతలా దేవి ట్రైలర్‌పై స్పందించాడు. `ఎలాంటి పాత్రలో అయినా ఈజీగా ఒదిగిపోయే మహిళ. శకుంతలా దేవిగా విద్యాబాలన్‌ను చూసేందుకు ఎదురుచూస్తున్నా` అంటూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు. నటి ఫాతిమా సనాషేక్‌ మాట్లాడుతూ `ప్రియమైన మహిళ యొక్క జబర్దస్త్ ట్రైలర్‌` అంటూ కామెంట్ చేసింది.

వీరితో పాటు నుశ్రత్ భరూచ,  దర్శకుడు అశ్విన్‌ తివారీ, తాప్సీ పన్ను, కృతీ కర్బంద, గునీత్‌ మోంగ, భూమీ పడ్నేకర్‌, దియా మీర్జా, రాధిక మధన్‌లు కూడా శకుంతలా దేవీ ట్రైలర్‌పై స్పదించారు. అక్షయ్‌ కుమార్‌, తాప్సీ, నిత్యా మీనన్‌, విద్యా బాలన్‌ నటించిన మిషన్‌ మంగళ్ సినిమా కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమానే, శకుంతలా దేవి కూడా అదే తరహాలో రూపొందింది. 

విద్యా బాలన్‌, సాన్య మల్హోత్రా, అమిత్ సాధ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనుమీనన్ దర్శకత్వం వహించారు. అబుడాంటియా ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ సినిమాను ఈ నెల 31న అమెజాన్‌ ప్రైమ్ ద్వారా విడుదల కానుంది.