కరోనా మహమ్మారి నెమ్మదిగా చిత్ర పరిశ్రమని ముంచెత్తుతుంది. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు వైరస్‌కి గురయ్యారు. బిగ్‌బీ ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ వైరస్‌ నుంచి బయటపడ్డారు. సింగర్‌ స్మిత, సునితా, బండ్ల గణేష్‌ వంటి ప్రముఖులు కోలుకున్నారు.  ప్రస్తుతం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతున్నారు. 

ఈ నేపథ్యంలో మరో సెలబ్రిటీని వైరస్‌ తాకింది. బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ వైరస్‌కి గురయ్యాడు. ఈ విషయాన్ని అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. తనకు లక్షణాలు బయటపడలేదని, వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు తెలిపారు.

`ఈ విషయాన్ని తెలియజేయడం నా బాధ్యత. నాకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా. లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. వైద్యులు, ప్రభుత్వ అధికారుల సూచనలు, సలహాల మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ముందుగానే ధన్యవాదాలు. నా ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్స్ మీతో షేర్‌ చేసుకుంటా. ఈ అసాధారణ, ఊహించని కఠిన సమయాల్లో మానవత్వమే వైరస్‌పై విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. ప్రేమతో అర్జున్‌` అని ఓ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు.

View this post on Instagram

🙏🏽

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Sep 6, 2020 at 1:33am PDT

అర్జున్‌ పోస్ట్ కి ఆయన అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ సపోర్ట్ గా నిలుస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీలు సైతం ఆయనకు ధైర్యాన్నిస్తున్నారు. ప్రస్తుతం అర్జున్‌ కపూర్‌ `సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌`తోపాటు మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక.