సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు ఇప్పుడు బాలీవుడ్‌ మొత్తాన్ని వణికిస్తుంది. ముఖ్యంగా డ్రగ్ కేసులో సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి 25 మంది బాలీవుడ్‌ స్టార్స్ పేర్లని బయటపెట్టింది. అందులో స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ తనయ సారా అలీఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ సన్నిహితురాలు సైమోన్‌ ఖంబట్టా పేర్లని టైమ్స్ నౌ మీడియా సంస్థ బయటపెట్టింది. 

ఈ ముగ్గురు పేర్లు బయటకు రావడంతో మిగిలిన వారిలో వణుకు స్టార్ట్ అయ్యింది. తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని షేక్‌ అవుతున్నారు. క్షణ క్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే 25 మంది సెలబ్రిటీలకు నార్కొటిక్‌ సంస్థ ఎన్‌సీబీ నోటీసులు పంపింది. ఏ క్షణంలోనైనా వీరిని విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పుడు వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వీరే కాదు డ్రగ్స్ తో సంబంధమున్న ఇతర సెలబ్రిటీలు సైతం ఆందోళన చెందుతున్నారు.

టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు బయటకు రావడంతో ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఆందోళన నెలకొంది. ఎందుకంటే మూడేళ్ళ క్రితం డ్రగ్స్ తీసుకున్న కేసులో టాలీవుడ్‌ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. అందులో ఓ స్టార్‌ హీరో పేరు కూడా ప్రముఖంగా వినిపించడం గమనార్హం. దీంతో ఈ డ్రగ్ కేసు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎవరు టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు చెబుతారో అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది.

అయితే గతంలో వచ్చిన డ్రగ్స్ కేసు కొన్ని రోజులు ప్రభుత్వం హడావుడి చేసి, ప్రముఖుల ఒత్తిళ్ళ మేరకు దాన్ని నిర్వీర్యం చేశారు. ఒకరిద్దరిని బలిపశువులు చేశారు. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ వ్యవహారం బయటపడితే పరిస్థితి ఏంటనే ఉత్కంఠ నెలకొంది. నిజం చెప్పాలంటే డ్రగ్స్ మాఫియా గుట్టు విప్పితే టాలీవుడ్‌లోనూ చాలా మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయని విమర్శకులు భావిస్తున్నారు. రకుల్‌ని విచారిస్తే..ఆమె ఇంకెవరి పేర్లని చెబుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా సుశాంత్‌ కేసు బాలీవుడ్‌లోనే కాదు, మున్ముందు టాలీవుడ్‌ని కూడా షేక్‌ చేసే ఛాన్స్ ఉందని క్రిటిక్స్ అంటున్నారు. మరి ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.