బాలీవుడ్(హిందీ) టీవీ టాక్ షోల్లో సెక్స్ గురించి మాట్లాడటం చాలా కామన్ అయిపోయింది. ఏ టాక్ షోలో అయినా, ఇంటర్వ్యూల్లో అయినా నటీనటులతో సెక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు హోస్టులు. ఈ నేపథ్యంలో ఒక హిందీ టీవీ చానల్ లో నటి నేహా దుపియా నిర్వహించే టాక్ షోకు హాజరైన బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, నటి భూమి పడ్నేకర్ లు తమ హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయారు.సెక్స్ గురించి వీరిని గుచ్చి గుచ్చి అడిగింది నేహా. ‘మీరు సెక్స్ లేకుండా ఉండగలరా? ఔను అంటే అదెన్ని రోజులు..’అని ప్రశ్నించుకొచ్చింది నేహ. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తను వేరే ప్రాంతాలకు షూటింగులకు వెళ్లినప్పుడు సెక్స్ కు దూరంగా ఉంటానని ఆయుష్మాన్ చెప్పాడు. తనతో కలిసి నటించిన భూమి పడ్నేకర్ విషయంలో కూడా అతడే సమాధానం ఇచ్చాడు. ఆమె కూడా సెక్స్ లేకుండా గంట సేపు మాత్రమే ఉండగలదు అంటూ చమత్కరించుకొచ్చాడితను.
 

ఇక ఆ హీరోయిన్ రొమాంటిక్ ఇంట్రెస్టుల గురించి కూడా వివరించాడితను. ఆమె ఎక్కువ సేపు రొమాన్స్ ను కోరుకుంటుంది.. అని అంటూ ఈ హీరో వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని ఆమె కూడా ధ్రువీకరించింది. తనకు రొమాన్స్ ఎక్కువ సేపు కావాలని ఈమె చెప్పుకొచ్చింది. పడ్నేకర్ కు ప్రియుడు అయ్యేది ఎవరైనా.. అతడు ఎక్కువ సేపు రొమాన్స్ చేసే ఓపిక కలిగిన వాడై ఉండాలని.. ఆయుష్మాన్ వ్యాఖ్యానించాడు.