మహా సర్కారుకు హీరోయిన్ కంగనా రనౌత్ కి మధ్య భీకర పోరు నడుస్తుండగా, కొద్దిరోజు క్రితం ముంబైలోని కంగనా కార్యాలయాన్ని బ్రాహ్మిణ్ ముంబై కార్పొరేషన్ అధికారులు కూల్చివేయ ప్రయత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న నెపంతో ఆ బిల్డింగ్ ని తొలగించే ప్రయత్నం చేశారు. ముంబై హై కోర్ట్ ఆదేశాలతో బిల్డింగ్ కూల్చివేత కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. అప్పటికే బిల్డింగ్ చాల వరకు డ్యామేజ్ కావడం జరిగింది. 

తన కార్యాలయాన్ని కక్ష పూరితంగా కూల్చివేయ ప్రయత్నించారని కంగనా రనౌత్ మహా సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే తన ప్రాపర్టీకి జరిగిన నష్ఠానికి పరిహారం చెల్లించాలని కోర్టులో 2కోట్ల పరిహారం ఆశిస్తూ పిటీషన్ దాఖలు చేశారు. రెండు కోట్ల పరిహారం కోరుతూ కంగనా వేసిన పిటిషన్ పై ముంబై సివిక్ బాడీ స్పందిండం జరిగింది. పరిహారం  చెల్లింపు చట్ట విరుద్ధం అని, కంగనా పిటీషన్ రద్దు చేయాలని కోరడం జరిగింది. 

ఇరువర్గాల వాదనలపై కోర్ట్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర గవర్నమెంట్, కంగనా మధ్య వైరం నేపథ్యంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. అలాగే ఈ వివాదం జరిగిన వెంటనే కంగనా ముంబై వదిలిపెళ్లిపోయారు. ప్రస్తుతం కంగనా తన హోమ్ టౌన్ మనాలిలో ఉంటున్నారు. కంగనా ఎక్కడ ఉన్నా సోషల్ మీడియా ద్వారా తన పోరాటం కొనసాగిస్తోంది.