టీవీ9ను వదిలేసి సాక్షి ఛానెల్ లో చేరిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న  సంగతి తెలిసిందే. తన డిఫరెంట్ స్టయిల్, మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకునే బిత్తిరి సత్తి.. త్వరలోనే గరంగరం వార్తలు అనే కార్యక్రమంతో సాక్షిలో అలరించబోతున్నాడు. ఈ మేరకు ప్రకటన వీడియో కూడా విడుదల చేసారు. 

ప్రతి రోజూ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు, తిరిగి మరుసటి రోజు ఉదయం  8 గంటల 30 నిమిషాలకు ఈ గరగరం వార్తల కార్యక్రమం ప్రసారం కానుందిది. ఎప్పటి నుంచి ఈ పోగ్రాం అనే తేదీ ఇంకా ఫిక్స్ చేయలేదు. అలాగే ఈ లేటెస్ట్ గరం గరం వార్తలు ప్రొగ్రామ్ లో సత్తి ఎలాంటి అవతారంలో కనిపించబోతున్నాడనే విషయంపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు.
 
 ఇక ఇప్పటికే విడుదలైన ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోకు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సత్తి స్టైల్లో చేసిన ఈ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. బిత్తిరి సత్తి, సాక్షి టీవీకి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ.. ‘గరం గరం వార్తలు’ పెద్ద హిట్‌ కావాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సాక్షి టీవీలోకి సత్తి ఆగమనాన్ని సెలబ్రేట్‌ చేస్తూ విడుదల చేసిన తొలి ప్రోమోకు కూడా మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.

https://www.youtube.com/watch?v=GhTjyx6AsLQ&feature=emb_title
 
తాజాగా విడుదలైన ప్రోమోలో న్యూస్ రీడర్ గా కనిపించాడు.  కేవలం ప్రోమోలోనే ఇలా కనపడతారా లేక ఒరిజినల్ కార్యక్రమంలో కూడా ఆయన యాంకర్ గా కనిపిస్తాడా అనేది చూడాలి. 

ఇక టీవీ9 నుంచి బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి బయిటకు వచ్చి సాక్షి ఛానెల్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఛానెల్ నుంచి బయిటకు రావటానికి కారణం...ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి ఫొటోని వాడినందుకు, తండ్రి గురించి గొప్పగా చెప్పినందుకు మేనేజ్ మెంట్ కు కోపం రావడం వల్లనే బిత్తిరి సత్తి ఆ ఛానెల్ నుంచి బయటకొచ్చేశాడని వార్తలు వచ్చాయి.