టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్ డే నేడు. దీనితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు. తాజా ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం జరిగింది. సాయి శ్రీనివాస్ 2018లో సాక్ష్యం మూవీ చేయడం జరిగింది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది. ప్రచార చిత్రాలు కూడా మూవీపై అంచనాలు పెంచేశాయి. అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రం కనీస వసూళ్లు సాధించలేకపోయింది. సాక్ష్యం మూవీ అట్టర్ ప్లాప్ గా మిగలగా.. మూవీపై అశలు పెట్టుకున్న శ్రీనివాస్ తీవ్ర నిరాశకు గురయ్యారట. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాక్ష్యం ప్లాప్ కావడంతో శ్రీనివాస్ వెక్కి వెక్కి ఏడ్చాడట. పిల్లాడిలా ఏడుస్తున్న శ్రీనివాస్ ని తండ్రి బెల్లంకొండ సురేష్ ఓ అంధుల శరణాలయానికి తీసుకెళ్లారట. ఆ ఆశ్రమంలో ఉన్న గుడ్డివారైన చిన్న పిల్లలకు భోజనం చేయించి, స్వయంగా శ్రీనివాస్ వాళ్లకు వడ్డించేలా చేశాడట. సినిమా ప్లాపైన బాధలో నేను ఉంటే... నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారని శ్రీనివాస్ మొదట అనుకున్నారట. కానీ అక్కడ నుండి బయలుదేరేటప్పుడు తన మనసుకు రిలీఫ్ అనిపించిందట. 

కనీసం వాళ్ళు ఏమి తింటున్నారో కూడా వాళ్ళు చూడలేరు, అయినా ఆత్మస్తైర్యంతో బ్రతుకుతున్నారు. కాబట్టి కష్టాలకు లొంగిపోకూడదని ధైర్యం చెప్పాడట. ఇక సాయి శ్రీనివాస్ సంక్రాంతి అల్లుడుగా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు అదుర్స్ మూవీ జనవరి 15న విడుదల కానుంది. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సోనూ సూద్ కీలక రోల్ చేస్తున్నారు. అల్లుడు అదుర్స్ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు.