బిగ్‌బాస్‌4 పదో రోజు డిఫరెంట్‌గా సాగింది. ఇందులో ప్రధానంగా చాడీలు చెప్పుకోవడంతోనే సరిపోయింది. ఇక బీబీ టీవీ టాలెంట్‌ షో హైలైట్‌గా నిలిచింది. తొమ్మిదో రోజు రాత్రి లాస్య మరికొంత మంది కూర్చొని గుసగుసలాడుకున్నారు. పర్సనల్‌గా మాట్లాడుకునేందుకు టైమ్‌ లేదని చెప్పుకుంటున్నారు. 

ఆ తర్వాత పదో రోజు ఉదయం అందరు `ఎవడు కొడితే దిమ్మితిరిగి మైండ్‌ బ్లాంక్‌`.. అనే పాటకి స్టెప్పులేశారు. అందులో ఒకరిపై ఒకరు పిల్లోస్‌ విసురుకోవడం సందడిగా సాగింది.  

అఖిల్‌, కరాటే కళ్యాణి కలిసి టిఫిన్‌ చేశారు. అఖిల్‌ మోనాల్‌కి దోశ వేసిచ్చాడు. పక్కన ఉన్న అభిజిత్‌కి టిఫిన్‌ ఇవ్వలేదు. ఆ తర్వాత మోనాల్‌, అఖిల్‌ మధ్య డిస్కషన్‌లో.. మోనాల్‌ని హార్ట్ తో మాట్లాడాలని, యాక్టింగ్‌ చేయొద్దని అఖిల్‌ చెప్పాడు. అదే సమయంలో చాడీలు చెప్పొద్దని మోనాల్‌కి క్లాస్‌ పీకాడు అఖిల్‌. 

అఖిల్‌తో వివాదాన్ని అభిజిత్‌.. లాస్య, సుజాతతో పంచుకున్నాడు. వివాదాస్పదంగా ఈ ఎపిసోడ్‌ సాగింది. అదే సమయంలో అఖిల్‌, అభిజిత్‌, మోనాల్‌ మధ్య ఏదో జరుగుతుందనే విషయం స్పష్టమవుతుంది. 

ఇక స్సెషల్‌ ఎపిసోడ్‌లో భాగంగా `బీబీటీవీ` టాలెంట్‌ షో ఉంటుందని, అందులో తమ ప్రతిభని చాటుకోవాలని కుమార్‌ సాయి తెలిపాడు. ఇందులో నోయల్‌, లాస్య జడ్జ్‌లుగా వ్యవహరించారు. హరికా, మెహబూబ్‌ డాన్స్ వేశారు. మోనాల్‌, సోహైల్‌ డ్యూయెట్‌ పాడారు. అరియానా యాంకర్‌గా వ్యవహరించారు. జడ్జ్ లు యాంకర్‌ పనితనం కూడా జడ్జ్ చేయాలనేది కండీషన్‌. 

అమ్మ రాజశేఖర్‌ డాన్స్ నేర్పించారు. అంతేకాదు బీబీ టాలెంట్‌ షోలో మొదటగా డాన్స్ వేసి ఆకట్టుకున్నారు. అమ్మ రాజశేఖర్‌పై జడ్జ్ లాస్య సెటైర్లు వేయగా, అందుకు తగ్గట్టే ఆయన పంచ్‌లు వేసి నవ్వులు పూయించారు. మరో జడ్జ్ నోయల్‌ ఆయన నెంబర్‌ వన్‌ మార్క్ ఇచ్చాడు. 

సోహైల్‌, మోనాల్‌ కలిసి డ్యూయెట్‌ సాంగ్‌ చేశారు. వాన వాన పాటకి అదిరిపోయేలా డాన్స్ వేసి ఆకట్టుకున్నారు. అందుకు జడ్జ్ నోయల్‌.. మోనాల్‌ వెరీ గుడ్‌ పర్‌ఫెర్మెన్స్ అని హత్తుకున్నారు. లాస్య కూడా హత్తుకుంది. సోహైల్‌, మోనాల్‌ డాన్స్ హాట్‌గా ఉందంటూ లాస్య ప్రశంసించింది. అయితే మోనాల్‌..సోహైల్‌తో డాన్స్ వేసేటప్పుడు అఖిల్‌ ఫేస్‌ వాడిపోయినట్టుగా కనిపించింది. 

బీబీ టాలెంట్‌ షో బ్రేక్‌లో దేవి నాగవల్లి, కరాటే కళ్యాణి చేసిన కమర్షియల్‌ యాడ్, అందులో అభిజిత్‌, అఖిల్‌ బప్‌చిక్‌ పాడ్స్ అంటూ రావడం ఆద్యంతం ఆకట్టుకుంది. 

షోలో బ్రేక్‌ తర్వాత దేత్తడి హరిక, మెహబూబ్‌ కలిసి మాస్‌ బీట్‌కి స్టెప్పులేశారు. ఆద్యంత ఎనర్జిటిక్‌ స్టెప్పులతో షోకి ఊపుతీసుకొచ్చారు. దీనికి అందరు విజిల్స్ వేసి సందడి చేశారు. నోయల్‌ వచ్చి హరిక, మెహబూబ్‌లను హత్తుకున్నాడు. లాస్య వారి డాన్స్ ని తనదైన స్టయిల్‌లో ఎక్స్ ప్లెయిన్‌ చేసి నవ్వించింది. 

బీబీ టాలెంట్‌ షోలో స్టార్‌ పర్‌ఫెర్మెర్‌గా మెహబూబ్‌ని ఎంపిక చేశారు. గంగవ్వతో మెడల్‌ని అందించారు. ఈ సందర్భంగా మెహబూబ్‌ చెబుతూ, నేను ఇంత బాగా చేయడానికి కారణం అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ అని చెప్పడం విశేషం. ఇక లేడీ స్టార్‌ పర్‌ఫెర్మెర్‌గా దేత్తడి హారికని ఎంపిక చేసి మెడల్‌ అందించారు.

చివరకు అందరు కలిసి డాన్స్ వేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఒకరికొకరు పెయిర్‌గా ఏర్పడి రెచ్చిపోయి డాన్స్ వేశారు. కుమార్‌ సాయి సింగిల్‌గానే డాన్స్ వేస్తూ ఆనందించాడు. నోయల్‌.. మోనాల్‌కి జోడీగా డాన్స్ వేస్తూ రెచ్చిపోయాడు. మొత్తంగా పదో రోజు బీబీ టాలెంట్‌ షో తప్ప మరేది ఆకట్టుకోలేకపోయింది.