బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 66వ ఎపిసోడ్‌లో పెద్ద డ్రామాకి తెరలేపాడాడు బిగ్‌బాస్‌. అర్థరాత్రి ఒంటిగంటకు లేపి సభ్యులంతా సూట్‌కేసులు సర్దుకుని గార్డెన్‌లోకి రావాలన్నారు. తమకి ఫైనల్‌కి వెళ్లేందుకు అడ్డుపడుతున్న వ్యక్తి ఎవరో ఏకాభిప్రాయంతో చెప్పండి అన్నాడు. అందరు కలిసి అఖిల్ పేరుని సూచించారు. అభిజిత్‌ తన పేరునే చెప్పుకున్నా, చివరి అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తానన్నారు. అఖిల్‌ సైతం తన పేరు చెప్పుకున్నారు. కానీ అందరు సూచించినట్టు అఖిల్‌ని హౌజ్‌ నుంచి బయటకు పంపించేశారు. 

ఇదిలా ఉంటే వారం మధ్యలో ఎలిమినేషన్‌ ఏంటి అనే డౌట్‌ అందరికి కలుగుతుంది. బిగ్‌బాస్‌ ట్విస్టుల్లో భాగంగా అఖిల్‌ విషయంలో కూడా పెద్ద డ్రామాకి తెరలేపారని అర్థమవుతుంది. అయితే మొన్న ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని సుమని తీసుకొచ్చి చివర్లో షాక్‌ ఇచ్చారు. అయితే అఖిల్‌ విషయంలో మాత్రం బిగ్‌బాస్‌ పెట్టిన ట్విస్ట్ అందరికి తెలిసిపోయింది. బిగ్‌బాస్‌ గేమ్‌ ఆడుతున్నాడని సభ్యులకు అర్థమైపోయింది. దీంతో వారు సైతం డ్రామాలకు తెరలేపారు. మోనాల్‌ తన దైన స్టయిల్‌లో ఏడుపుతో అఖిల్‌పై ప్రేమని చాటుకుంటుంది. అదే సమయంలో ఇకపై తన గేమ్‌ తాను ఆడుతానని తెలిపింది. అంటే ఇన్నాళ్లు గేమ్‌ ఆడలేదా? అనే సందేశాలను కలిగించింది.

అభిజిత్‌, లాస్య, హారిక ఇదంతా బిగ్‌బాస్‌ గేమ్‌ అని అర్థమై, దాని తగ్గట్టు రియాక్ట్ అవుతున్నారు. సోహైల్‌ తన మార్క్ డేరింగ్‌తో తన యాక్టింగ్‌ని రెట్టింపు చేశాడు. మెహబూబ్‌ సైతం ఆయనకు వంతపాడుతున్నాడు. అరియానా సైలెంట్‌గానే ఉండగా, అవినాష్‌ సెటిల్డ్ గా దాన్ని మ్యానేజ్‌ చేస్తున్నాడు. ఇక సీక్రెట్‌ హౌజ్‌లోకి వెళ్ళిన అఖిల్‌.. ఇంటిసభ్యుల అసలు స్వరూపాలను తెలుసుకుంటున్నాడు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో వింటూ హో.. హో అనుకుంటున్నాడు. మొత్తానికి ఇంటి సభ్యులపై బిగ్‌బాస్‌ కన్నే కాదు, మరో కన్నుగా అఖిల్‌ మారాడని అర్థమవుతుంది. 

ముఖ్యంగా అభిజిత్‌ విషయంలో ఆయన చాలా రియలైజ్‌ అయినట్టు తెలుస్తుంది. అభిజిత్‌ మాట్లాడే మాటలకు దెండం పెడుతున్నాడు. మొత్తంగా అఖిల్‌కి, ఇంటిసభ్యుల అసలు స్వరూపాన్ని చూపించే ప్రయత్నం బిగ్‌బాస్‌ చేస్తున్నాడని అర్థమవుతుంది. అయితే ఏకాభిప్రాయంతో సభ్యుడిని ఎంపిక చేయడంలోనే సభ్యులకు క్లారిటీ లేదు. లాజిక్‌లు వదిలేసి ఆయన్ని ఎంపిక చేశారు. అభిజిత్‌, అరియానా, లాస్య కాస్త లాజికల్‌గానే ఆడి ప్రయత్నం చేసినా, మెజారిటీ అభిప్రాయంతో వారి ఆభిప్రాయాలను పక్కన పెట్టేశాడు. మరి ఈ సీక్రెట్‌ టాస్క్ రివీల్‌ కావాలంటే శనివారం వరకు ఆగాల్సిందే.