బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 స్టార్ట్ అయ్యింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్‌ ఉంటుందని హోస్ట్ నాగార్జున చెబుతున్నాడు. మూడో సీజన్‌కి కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో బిగ్‌బాస్‌ ఉంటుందో లేదో అనే సందేహం నెలకొన్న నేపథ్యంలో అవన్నీ పక్కన పెట్టి, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ బిగ్‌బాస్‌ 4 సీజన్‌ని ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఈ రియాలిటీ షో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 

నాగ్‌ ఎంట్రీతో షో షురూ అయ్యింది. పైనుంచి నాగ్‌ కిందకు దించారు. `కింగ్‌` సినిమాలో కింగ్‌ సాంగ్‌, `మాస్‌`, `నువ్వొస్తావని.. `. `చీకటితో వెలుగే నింపెను.. `, `దేవుడే దిగివచ్చినా`, వంటి పాటలకు నాగ్‌ స్టెప్పులేశారు. అయితే ఈ సారి నెవర్‌ బిఫోర్‌ అంటూ తెలిపారు. అంతేకాదు మొదటిసారి గెస్ట్ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంటరయ్యారని తెలిపారు. ఆ గెస్ట్ నాగ్‌ తండ్రిగా వెళ్ళాడు. ఆయన బిగ్‌ బాస్‌ హౌజ్‌లోని అన్ని విభాగాలను చూపించారు. స్పెషల్‌ రూమ్స్ కూడా ఉన్నట్టు తెలిపారు. ఇందులో 16 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్‌ చేస్తున్నట్టు తెలిపారు. 

మొత్తంగా ఇదొక వండర్‌లాండ్‌లా ఉందని చెప్పారు. ఇక నాగ్‌ కరోనా సమయంలో లైఫ్‌కి, వినోదాన్ని బ్రేక్‌ లేదని చెబుతూ బిగ్‌బాస్‌కి కొత్త ఊపుని తీసుకొచ్చారు.