బిగ్‌బాస్‌4 ఎనిమిదో రోజు కాస్త డల్‌గానే స్టార్ట్ అయ్యింది. రాత్రి సమయంలో రెండు మూడు గ్రూపులుగా ఏర్పడి గుసగుసలు పెట్టుకున్నారు. అఖిల్‌, మోనల్‌ మధ్య ఏదో డిస్కషన్‌ జరిగింది. అది అనుమానాలకు తావిచ్చింది. ఆ తర్వాత అభిజిత్‌, మోనల్‌ గజ్జర్‌ మధ్య గుసగుసలు సాగాయి. మధ్యలోనే మోనల్‌ వెళ్ళిపోయింది. 

ఆ తర్వాత కుమార్‌ సాయి హౌజ్‌లోకి కొత్త కంటెస్టెంట్‌గా వచ్చాడు. ఆయన వచ్చి దుప్పటి కప్పుకుని పడుకుని బిగ్‌బాస్‌ ఆదేశాలు అని, అందు తమ వద్దకి రావాలని గాంభీర్యంగా చెప్పడం కాస్త ఉత్కంఠకు గురి చేసింది. అంతలోనే తేలిపోయింది. ఆయన కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ అని ముందే తెలిసిందే. 

ఉదయం ఎనిమిది గంటల టైమ్‌లో అందరు లేచి వ్యాయామం తరహాలో ఓపాటకు డాన్స్ లు చేశారు. ఆ తర్వాత అఖిల్‌, మోనల్‌ గజ్జర్‌, అభిజిత్‌కి మధ్య ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ సాగింది. ఇంతలో రేషన్‌ ఎపిసోడ్‌ వచ్చింది. రేషన్‌ మేనేజర్‌ ఎంపిక విషయంలో వాగ్వాదం జరగ్గా, చివరకు లాస్య అమ్మా రాజశేఖర్‌ని రేషన్‌ మేనేజర్‌గా ఎంపిక చేశారు. 

ఆ తర్వత బోట్‌ ఎపిసోడ్‌ ప్రారంభమైంది. ఈ ఎనిమిదో రోజు మొత్తం ఎపిసోడ్‌లో కాస్త ఆకట్టుకున్నదేమైనా ఉందంటే అది బోట్‌ ఎపిసోడే. అందులోకి ఎక్కాక నోయల్‌ పాటపాడాడు. ఆ తర్వాత మధ్య ఇతరులు అందుకు దాన్ని కామెడీగా మార్చారు. ఇంతలో ఎలిమినేషన్‌కి నామినేషన్స్ ప్రారంభమయ్యింది. ఎలిమినేషన్‌ ప్రక్రియ అయిన బోట్‌ ఎపిసోడ్‌లో.. బోట్‌ మొత్తంగా తొమ్మిది తీరాల గుండా వెళ్తుందని, ప్రతి తీరం వద్ద హారన్‌ వస్తుందని, హారన్‌ మోగిన ప్రతి సారి, అంటే ప్రతీ తీరం వద్ద ఒక్కరు దిగిపోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ కండీషన్స్ పెట్టారు. అలా దిగిపోయిన వాళ్లు ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయినట్టు లెక్క. 

బోట్‌లో మొత్తం 15సీట్లు ఉన్నాయి. పదిహేను మంది కూర్చున్నారు. కెప్టెన్‌ లాస్యని ఎలిమినేషన్‌ నుంచి బిగ్‌బాస్‌ మినహాయింపు ఇచ్చాడు. దీంతో ఆమె సేవ్‌ అయ్యారు. మిగిలిన 15 మందిలో ముందు ఎవరు
దిగిపోవాలనేది పెద్ద చర్చే సాగింది. గంగవ్వని అందరు సూచించగా.. మొదట ఆమె దిగనని చెప్పేసింది. కానీ హారన్‌ మోగేసరికి దిగేసి ఆశ్చర్య పరిచింది. రెండో తీరం వద్ద నోయల్‌ దిగిపోయాడు. మూడో తీరం వద్ద మోనల్‌ గజ్జర్‌ దిగింది. 

నాలుగో తీరం వద్ద హారన్‌ మోగే సమయంలో పెద్ద డిస్కషన్‌ జరిగింది. కుమార్‌ సాయి తాను అందరు దిగమంటే దిగుతానని, అందుకు కారణం చెప్పాలన్నారు. ఆ డిస్కషన్‌లో జరుగుతుండగానే హారన్‌ మోగింది. టక్కున్న సోహైల్‌ దిగిపోయాడు. ఐదో హారన్‌ మోగినప్పుడు కరాటే కళ్యాణి దిగిపోయింది. ఆరో తీరం వద్ద అమ్మ రాజశేఖర్‌ దిగిపోయాడు. 

మరోసారి కుమార్‌ సాయి విషయంలో సభ్యులకు వాగ్వాదం జరిగింది. అందరు ఆయన్ని సూచించారు. వాగ్వాదం అనంతరం ఏడో హారన్‌ వద్ద కుమార్‌ సాయి దిగిపోయాడు. ఆ తర్వాత ఎనిమిదో హారన్‌ వద్ద హారిక
దిగింది. చివరగా అభిజిత్‌ దిగిపోయారు. ఇలా మొత్తం ఈ వారం తొమ్మిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు.