తెలుగులో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ మరో అరుదైన రికార్డ్ సృష్టించింది. ప్రారంభం రోజున అత్యధిక మంది వీక్షించిన షోగా రికార్డ్ సృష్టించింది. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్‌ తొలిరోజు కోట్ల మంది వీక్షించారని స్టార్‌ మా ప్రకటించింది. 

ఇదిలా ఉంటే తాజాగా మరో రికార్డ్ ని సృష్టించింది. ఇది ఇండియాలోనే అత్యధిక రేటింగ్‌ పొందిన `బిగ్‌బాస్‌` షోగా నిలిచిందట. ఆదివారం షో ఎండింగ్‌లో నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. మొదటి వారం దేశంలోనే తెలుగు బిగ్‌బాస్‌4కి అత్యధిక రేటింగ్‌ వచ్చి సరికొత్త రికార్డుని సృష్టించిందని చెప్పారు. కోట్ల మంది షోని చూస్తున్నారని, కంటెస్టెంట్లని గమనిస్తున్నారని, ప్రతి ఒక్కరు బాగా ఆడాలని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలిపారు. 

ఇక తొలిరోజు `బిగ్‌బాస్‌4` ఇప్పటి వరకు తెలుగు `బిగ్‌బాస్‌` చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన షోగా నిలిచింది. `బిగ్‌బాస్‌4` తొలి ఎపిసోడ్‌ ఏకంగా 18.5టీఆర్సీ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దీంతో ఈ షో టాప్‌లో నిలిచింది. తొలి ఎపిసోడ్‌ని ఏకంగా నాలుగున్నర కోట్ల మంది వీక్షించారు. అంటే మన తెలుగునాట ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ షో చూశారని `బిగ్‌బాస్‌4` యూనిట్‌ తెలిపింది.