బిగ్ బాస్2: ఈ వీక్ నామినేషన్స్ మరిన్ని వివాదాలకు దారి తీస్తుందా..?

bigg boss2: who will nominate in this week
Highlights

ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ పరిగెడుతూ కింద పడిపోవడం, ఒకరినొకరు తోసుకోవడం వంటివి హౌస్ లో మరిన్ని వివాదాలకు దారి తీసే ఛాన్స్ ఉంది. గేమ్ ని స్పోర్టివ్ గా తీసుకొని ఆడితే ఓకే లేదంటే మాత్రం ఈ టాస్క్

బిగ్ బాస్ 2 రియాలిటీ షోపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిపోతుంది. కానీ దీనికి సంబంధించిన నామినేషన్, వైల్డ్ కార్డు ఎంట్రీ వంటి విషయాలు ముందే బయటకు లీక్ అవుతుండడంతో సస్పెన్న్ అనేది సరిగ్గా క్యారీ చేయలేకపోతున్నారు నిర్వాహకులు. నిన్నటి ఎలిమినేషన్ లో నందిని బయటకి వెళ్లిపోతుందనే విషయం కూడా ముందే లీక్ అయింది.

ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న షో తొమ్మిదో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ కు సంబంధించిన టాస్క్ ను హౌస్ మేట్స్ కు ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ఏంటంటే.. మ్యూజిక్ ప్లే అయ్యే ప్రతిసారి హౌస్ మేట్స్ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన టెంట్ హౌస్ లోకి వెళ్లాలి. ఎవరైతే.. ఆఖరిగా వెళ్తారో వారు ఈ వీక్ ఎలిమినేషన్స్ కి నామినేట్ అవుతారు.

ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ పరిగెడుతూ కింద పడిపోవడం, ఒకరినొకరు తోసుకోవడం వంటివి హౌస్ లో మరిన్ని వివాదాలకు దారి తీసే ఛాన్స్ ఉంది. గేమ్ ని స్పోర్టివ్ గా తీసుకొని ఆడితే ఓకే లేదంటే మాత్రం ఈ టాస్క్ కారణంగా హౌస్ లో మరిన్ని గొడవలు జరగడం ఖాయం. మరి ఈ వారం ఎవరు నామినేట్ అవుతారో చూడాలి!

 

loader