బిగ్ బాస్2: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఒక్కరే.. అది ఎవరంటే..?

bigg boss2: nandini will eliminate in this week
Highlights

ఈ వారం నామినేషన్ లో కౌశల్, దీప్తి నల్లమోతు, బాబు గోగినేని, గణేష్, నందిని లు ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో కౌశల్, బాబు సేఫ్ జోన్ లో ఉన్నట్లు నాని ప్రకటించారు. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి కానీ ఒక్కరినే హౌస్ నుండి పంపబోతున్నారు

బిగ్ బాస్ సీజన్2 హైదరాబాద్ లో జరుగుతుండం, షోకి హాజరయ్యే కొందరు ముందుగానే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాలను లీక్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు హౌస్ లోకి ఎవరు వెళ్లబోతున్నారు..? హౌస్ నుండి బయటకి వచ్చేదెవరు..? అనే విషయాలు ముందుగానే తెలిసిపోతున్నాయి.

ఇప్పుడు ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం కూడా ముందే లీక్ అయింది. ఈ వారం నామినేషన్ లో కౌశల్, దీప్తి నల్లమోతు, బాబు గోగినేని, గణేష్, నందిని లు ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో కౌశల్, బాబు సేఫ్ జోన్ లో ఉన్నట్లు నాని ప్రకటించారు. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి కానీ ఒక్కరినే హౌస్ నుండి పంపబోతున్నారు. అది కూడా నందిని అని తెలుస్తోంది.

ఈ వారం 12 కోట్ల ఓట్లు ఈ వారంలో వస్తే అందులో డెబ్భై శాతం కౌశల్ కే పడినట్లు సమాచారం. మిగిలిన ఓట్లలో అతి తక్కువ ఓట్లు నందినికి పడ్డాయట. దీంతో ఈ వరం హౌస్ నుండి బయటకి వెళ్లేది ఆమె అని సమాచారం. 

loader