బిగ్ బాస్2: నందిని అవుట్.. ఎమోషనల్ అయిన తనీష్

bigg boss2: nandini eliminated from house
Highlights

బిగ్ బాస్ సీజన్2 ఎనిమిదవ వారం ఎలిమినేషన్ లో ఎవరు బయటకు వెళ్లబోతున్నారనే విషయం ముందుగానే లీక్ అయింది. హౌస్ లోకి ఇద్దరు హౌస్ మేట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లడంతో ఈ వారం ఇద్దరు హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి

బిగ్ బాస్ సీజన్2 ఎనిమిదవ వారం ఎలిమినేషన్ లో ఎవరు బయటకు వెళ్లబోతున్నారనే విషయం ముందుగానే లీక్ అయింది. హౌస్ లోకి ఇద్దరు హౌస్ మేట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లడంతో ఈ వారం ఇద్దరు హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఒక్కరిని మాత్రమే ఎలిమినేట్ చేశారు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు నందిని.

అయితే ఆమె హౌస్ నుండి బయటకి వచ్చే సమయంలో తనీష్ ఎమోషనల్ అయ్యాడు. హౌస్ లో వారిద్దరి మధ్య స్పెషల్ బాండ్ ఏర్పడడంతో నందిని వెళ్లిపోవడంతో తనీష్ కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించారు. ఇక స్టేజ్ మీదకి వెళ్లి నానితో మాట్లాడిన నందిని అతడి పర్మిషన్ తో గీతామాధురి, దీప్తి నల్లమోతు, తనీష్ లతో మాట్లాడారు. హౌస్ లో ఈ ముగ్గురు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.

ఇక ఈరోజు ఫ్రెండ్ షిప్ డే కావడంతో  హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం వారి స్నేహితులు స్పెషల్ వీడియోస్ ను రికార్డ్ చేసి పంపించారు. వాటిని బిగ్ బాస్ ప్లే చేసి హౌస్ మేట్స్ కి చూపించారు. ఈ వీడియోస్ చూసిన కంటెస్టెంట్స్ సంతోషంలో మునిగిపోయారు. తమ జీవితంలో తమ స్నేహితులతో ఉన్న బెస్ట్ మెమొరీస్ ను ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ఈరోజు ఎపిసోడ్ మరింత ఎంటర్టైనింగ్ గా సాగిందనే చెప్పాలి.   

loader