బిగ్ బాస్2: దీప్తి, నందిని, గణేష్ హౌస్ నుండి బయటకి వెళ్లేదెవరు..?

bigg boss2: babu gogineni and kaushal are in safe zone
Highlights

సేఫ్ జోన్ లో బాబు గోగినేని, కౌశల్ ఉన్నట్లు ప్రకటించారు. మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్ లో వెల్లడించనున్నారు. 

బిగ్ బాస్ సీజన్ 2 మొదలయ్యి యాభై రోజులు పూర్తయిపోయింది. ఏడవ వారంలో ఎలిమినేషన్ లేదని ప్రకటించిన నాని ఈ వారంలో ఇద్దరు హౌస్ మేట్స్ ను బయటకి పంపించే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ వారంలో ఎలిమినేషన్ లో బాబు గోగినేని, కౌశల్, దీప్తి, నందిని, గణేష్ లు నామినేట్ అయ్యారు. అయితే ఎవ్వరూ కూడా తాము నామినేషన్ లో ఉన్నట్లు ప్రెషర్ తీసుకోకుండా గేమ్ ఆడి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు.

ఈ వారం మొత్తం డిఫరెంట్ టాస్క్ లు, సరికొత్త పెర్ఫార్మన్స్ లతో హౌస్ మేట్స్ ఎంజాయ్ చేస్తూనే ప్రేక్షకులకు ఫుల్ ఫన్  అందించారు. శనివారం ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన నాని తనదైన హోస్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ ఎలా పెర్ఫార్మ్ చేశారో అందరికీ రివ్యూలు ఇచ్చారు. కానీ దీప్తి సునైనాతో మాత్రం మాట్లాడలేదు. ఇక సేఫ్ జోన్ లో బాబు గోగినేని, కౌశల్ ఉన్నట్లు ప్రకటించారు.

మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్ లో వెల్లడించనున్నారు. గణేష్, నందిని బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఉందనే మాటలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి!

loader