Asianet News TeluguAsianet News Telugu

హౌస్ లో నుండి మొదట బయటికి వచ్చేది నువ్వే... బిగ్ బాస్ విన్నర్ కౌశల్ క్రేజీ కామెంట్స్!

చిన్న విషయానికే ఎమోషనల్ కావడంతో పాటు కన్నీరు పెట్టుకున్న జస్వంత్ పై బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

bigg boss title winner kaushal made interesting comments on season 5 contestant
Author
Hyderabad, First Published Sep 7, 2021, 4:29 PM IST

రెండవ ఎపిసోడ్ లోనే కంటెస్టెంట్స్ మధ్య హీట్ మొదలైంది. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదటి వారం ఎలిమినేషన్ కి గానూ ఆరుగురు నామినేట్ అయ్యారు. ఆర్జే కాజల్, యాంకర్  రవి,మానస్, జస్వంత్,సరయు, హమీదాలలో ఒకరు వచ్చే వారం ఇంటి నుండి బయటికి రానున్నారు. కాగా నామినేషన్స్ ప్రక్రియ జరిగే సమయంలో జెస్సి అలియాస్ జస్వంత్, విశ్వ మధ్య వాదులాట నడిచింది. అదే సమయంలో ఎక్కువ మంది జెస్సి హౌస్ నుండి వెళ్లిపోవాలని నామినేట్ చేశారు. 

జెస్సి కన్నీరు పెట్టుకోగా, ఇంటి సభ్యులు అతన్ని ఓదార్చారు. జెస్సిని నామినేట్ చేసినవారిలో  ఒకరైన నటరాజ్ మాస్టర్... చిన్నోడా నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు. అలా ఉంటే ఇక్కడ తొక్కేస్తారు. నువ్వు ఇక్కడ ఉండలేవని నాకు అనిపిస్తుంది. అందుకే నామినేట్ చేస్తున్నా.. అంటూ కామెంట్ చేశారు. 

చిన్న విషయానికే ఎమోషనల్ కావడంతో పాటు కన్నీరు పెట్టుకున్న జస్వంత్ పై బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘నా తర్వాత, సీజన్‌ 3లో అలీ రేజా తర్వాత మోడలింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చింది నువ్వే. మోడల్స్‌ కన్నీళ్లు పెట్టకూడదు. తమ యాటిట్యూడ్‌లో ప్రేమని గెలుచుకోవాలి.  అలా ఏడిస్తే మొదటగా హౌజ్‌ నుంచి ముందుగా నువ్వే బయటకు వస్తావు. జాగ్రత్తగా ఆడు. ఆల్‌ ది బెస్ట్‌’ అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 

బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న కౌశల్ టైటిల్ విన్నర్ గా నిలిచారు. సింగర్ గీతా మాధురితో పోటీపడి కౌశల్ టైటిల్ అందుకోవడం జరిగింది. ఇక జస్వంత్ కి కౌశల్ ఇచ్చిన సలహా వలన ప్రయోజనం లేదు . ఎందుకంటే బయట ప్రపంచంతో సంబంధాలు లేని కంటెస్టెంట్స్ కి బయటివారి కామెంట్స్, సలహాలు తెలిసే ఆస్కారం లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios