బిగ్ బాస్‌ సందడి మొదలైంది. ఆదివారం సాయంత్రం కింగ్ నాగార్జున గ్రాండ్‌ గా బిగ్‌ బాస్‌ షోను స్టార్ట్ చేశాడు. రెండు గెటప్‌లలో సందడి చేసిన నాగ్ ఒక్కొక్క కంటెస్టెంట్‌ను ఆడియన్స్‌ను పరిచయం చేస్తూ హౌస్‌లోకి పంపించాడు. గత సీజన్‌ల తరహాలోనే ఈ సీజన్‌లో  కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్‌లను వివిధ రంగాల నుంచి వివిధ నేపథ్యాల నుంచి సెలెక్ట్ చేశారు. అయితే బిగ్ బాస్‌ కార్యక్రమం టీవీలో ప్రారంభమైన దగ్గర నుంచి సోషల్ మీడియా మోత మోగిపోతుంది.

కనెక్షన్స్‌ పేరుతో కొత్త కిరికిరి పెట్టిన బిగ్ బాస్

ట్విటర్‌లో బిగ్‌ బాస్ టాప్‌లో ట్రెండ్‌ అవుతుంది. నేషనల్ లెవల్‌ లో #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఫేస్‌ బుక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ బిగ్ బాస్‌ ఓ రేంజ్‌లో ట్రెండ్‌ అవుతోంది. హౌస్‌లోకి హీరోయిన్‌ మోనాల్ గజ్జర్‌, దర్శకుడు సూర్య కిరణ్, యాంకర్ లాస్య, హీరో అభిజిత్‌, యాంకర్‌ జొర్దర్‌ సుజాత, దిల్‌ సే మెహబూబ్‌, టీవీ 9 యాంకర్‌ దేవీ నాగవల్లి, యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక, సీరియల్ నటుడు ఇస్మార్ట్ సోహైల్‌, యాంకర్‌ అరియానా గ్లోరిలు ఎంటర్‌ అయ్యారు.