బుల్లితెర మీద బిగ్ బాస్‌ సందడి మొదలైంది. ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైన షోలో 16 మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంటర్‌ అయ్యారు. వీరిలో 14 మంది నార్మల్‌గా హౌస్‌లో సందడి చేస్తుండగా మరో ఇద్దరు మాత్రం సీక్రెట్‌ రూం లో ఉంటున్నారు. సోమవారం నామినేషన్‌ ప్రక్రియ కూడా జరిగింది. హౌస్‌లోకి ఎంటర్‌ అయిన రోజు కనెక్షన్స్‌ పేరుతో ఇద్దరిని జంట చేసిన బిగ్ బాస్‌ వారిలో ఒకరిని నామినేట్‌ చేయాలంటే ఇంటి సభ్యులకు సూచించాడు.

ఈ నేపథ్యంలో గంగమ్మ, అభిజిత్, సుజాత, దివి, సూర్య కిరణ్‌, మెహబూబ్‌, అఖిల్ సార్తక్‌లు నామినేట్‌ అయ్యారు. వీరిలో ఒకరు ఈ వారం హౌస్‌ నుంచి ఎలిమేట్‌ కానున్నారు. ఇక సీక్రెట్‌ రూంలో ఉన్న ఇద్దరు ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకున్నారు. అయితే సీక్రెట్‌ రూంలో ఉన్నవారు ఫోన్ చేసి, హౌస్‌ మేట్స్‌ను తమకు ఫుడ్ పంపాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ విషయంలో సుజాత, కరాటే కళ్యాణీల మధ్య కాస్త గొడవ జరిగింది.

అయితే ఈ రోజు కూడా సీక్రెట్‌ రూం కంటెస్టెంట్‌లు హౌస్‌మెట్స్‌కు కాల్‌ చేసి మాట్లాడగా వారికి అదిరిపోయే షాక్ ఇచ్చారు నోయల్‌. అరియానా ఫోన్‌లో ఎవరు మాట్లాడుతున్నారు. మీ పేరేంటి అంటే నోయల్‌ నా పేరు గూగుల్ చేసుకో అంటూ కాల్ కట్‌ చేశాడు. అయితే సీక్రెట్‌ రూం హౌస్‌మెట్స్ ఎందుకు కాల్ చేశారు. వారు హౌస్‌మెట్స్‌కు ఇవ్వబోతున్న టాస్క్‌ ఏంటి అనేది తెలియాలంటే ఈ రోజు షో చూడాల్సిందే.