లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా టైం పాస్ చేస్తున్నారు. సాదారణ ప్రజానీకం కూడా ఖాళీగా ఉండటంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీ చేసే పోస్ట్‌లను ఇమిడియట్‌గా వైరల్‌ చేసేస్తున్నారు. తాజాగా బిగ్‌ బాస్ బ్యూటీ, సినీ నటి హిమజ చేసిన ఓ టిక్ టాక్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. లాక్‌ డౌన్ సమయంలో రెడ్‌ కలర్ బుల్లెట్‌ బైక్‌ మీద హిమజ హల్‌ చల్‌ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది.

ఈ వీడియోతో పాటు తన `శివ జ్యోతి ఆమె భర్త గంగూలికి కొనిచ్చిన బైక్‌ నా టిక్‌ టాక్ వీడియో కోసం వాడేసా` అంటూ కామెంట్ చేసింది. శివజ్యోతి, హిమజలు బిగ్ బాస్ సీజన్‌ 3 కలిసి పార్టిసిపేట్‌ చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అదే స్నేహం బిగ్‌ బాస్ ముగిసిన తరువాత కూడా కొనసాగుతోంది. తాజాగా లాక్‌ డౌన్‌ సమయంలోనూ హిమజా, శివ జ్యోతి రెగ్యులర్‌గా కలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శివ జ్యోతి భర్త బైక్ మీద ఓ రైడ్ కి వెళ్లింది హిమజ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

♦️Look At My Face In The Mirror 🎶 🎶 #bulletlovers #red #roadtrip

A post shared by Himaja Mallireddy (@itshimaja) on May 13, 2020 at 10:06pm PDT