ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 మొదట్లో డల్ గా సాగినప్పటికీ తనదైన వాక్చాతుర్యంతో షోని రక్తికట్టించారు ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్ స్థానంలో సీజన్ 2 కోసం నాని రంగంలోకి దిగాడు. ఇటీవల ఈ షో ఘనంగా మొదలైంది. ఈసారి ఇంకొచెం మసాలా అనడంతో షోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సీజన్1 తో పోలిస్తే.. సీజన్ 2 లో సెలబ్రిటీలు పెద్దగా క్రేజ్ లేని వారే ఉన్నారు.

గీతామధురి, తేజస్వి మదివాడ, బాబు గోగినేని వంటి వారు మినహాయించి హౌస్ లో చెప్పుకోదగ్గ పోటీదారులు లేరు. సామాన్యులకు అవకాశం కల్పించడం మంచి విషయమే.. అలానే ఈ షో ద్వారా వారందరికీ పాపులారిటీ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక కంటెస్టంట్స్ విషయానికొస్తే.. ఈ షోలో పాల్గొనేవారు తమ రెమ్యునరేషన్ గా ఎంత తీసుకుంటున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఇప్పటికే సింగర్ గీతా మాధురి అందరికంటే ఎక్కువ మొత్తంలో రూ.20లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

తనీష్, అమిత్, బాబు గోగినేని, తేజస్వి మదివాడలు రూ.8 లక్షల చొప్పున చార్జ్ చేయగా.. యాంకర్ శ్యామల, దీప్తి సునైనా, రోల్ రైడా, సామ్రాట్, కిరీటీ దామరాజు, కౌశల్, భాను వంటి తారలకు రూ.5 లక్షల వరకు రెమ్యునరేషన్ గా అందించారు. ఇక యాంకర్ దీప్తి, గణేష్, నూతన్ నాయుడు, సంజనలకు మూడు లక్షల రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. మరి వీరిలో విజేతగా ఎవరు నిలుస్తారో.. చూడాలి!