నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో నటుడు సామ్రాట్ పాల్గొన్న సంగతి తెలిసిందే. సామ్రాట్ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. బిగ్ బాస్ తో అతడి గుర్తింపు పెరిగింది.

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో నటుడు సామ్రాట్ పాల్గొన్న సంగతి తెలిసిందే. సామ్రాట్ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. బిగ్ బాస్ తో అతడి గుర్తింపు పెరిగింది. సామ్రాట్ లైఫ్ లో గొప్ప అనుభూతినిచ్చే సంఘటన జరిగింది. 

ఆగష్టు 15న దేశమంతా స్వాతంత్ర దినోత్సవం సంబరాల్లో ఉండగా సామ్రాట్ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిశాయి. సామ్రాట్ సతీమణి శ్రీలిఖిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సామ్రాట్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. 

View post on Instagram

అప్పుడే పుట్టిన తన కూతుర్ని చేతిలోకి తీసుకుని మురిసిపోతున్నాడు. ఇండిపెండెన్స్ డేని ఇలా సెలెబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అవును.. మేము ఆగష్టు 15న బేబీ గర్ల్ ని పొందాము అని ఇంస్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. స్పెషల్ డే రోజున కుమార్తె జన్మించడంతో సామ్రాట్ ఇంట్లో సంబరాలు రెట్టింపు అయ్యాయి. 

సామ్రాట్ కి గతంలో హర్షిత అనే అమ్మాయితో వివాహం జరిగింది. విభేదాల కారణంగా వీరిద్దరూ 2018లో విడిపోయారు. ఆ తర్వాత సామ్రాట్ 2020లో శ్రీలిఖిత ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. 

View post on Instagram