బిగ్ బాస్ సీజన్ 4 లో హైలెట్ అయిన అంశాలలో అఖిల్, మోనాల్ లవ్ స్టోరీ ఒకటి. ఈ ప్రేమ జంట తమ రొమాన్స్ తో ప్రేక్షకులను అలరించారు. హద్దులు మీరిన వీరి రొమాన్స్ ఒక వర్గం ప్రేక్షకులను ఇబ్బందిపెట్టినా కానీ, బిగ్ బాస్ మాత్రం ఓ పాయింట్ మీదే వీరిద్దనికి హౌస్ లో కొనసాగించాడన్న అపవాదు కూడానడిచింది . హౌస్ లో కెమెరాల ముందు, ముద్దులు హగ్గులతో రేచిపోయేవారు ఈ జంట. 
ఒకరికి కష్టం వస్తే మరొకరు చూడలేకపోయేవారు. 

ఇక మోనాల్ ఎలిమినేషన్ రోజు జరిగిన హై డ్రామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో మోనాల్ అసలు ఈ దేశం విడిచి వెళ్ళిపోతున్నట్లు అఖిల్ బాదపడిపోయాడు. తాను హౌస్ నుండి బయటికి వచ్చే వరకు హైదరాబాద్ లోనే ఉండాలని, నేను వచ్చి కలుస్తా అని ఆమెను ఆదేశించాడు. అఖిల్ చెప్పినట్లు మోనాల్ ఇప్పటికి కూడా హైదరాబాద్ లోనే ఉంది. 
ఇక అఖిల్, మోనాల్ తరచుగా కలుస్తూ ఉన్నారు. 

హౌస్ లో ఒకరికి ఒకరు ఉన్నట్లు ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోనున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మోనాల్, అఖిల్ హౌస్ బయట కూడా ఆ సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారు. ఇటీవల సోహెల్, మరియు అఖిల్ మోనాల్ ని కలవడం జరిగింది. వీరు గెట్ టుగెదర్ పార్టీలు చేసుకుంటున్నారు. మోనాల్ కి ఇక్కడ ఆఫర్స్ కూడా వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ని వీడడం లేదు. దీనితో అఖిల్, మోనాల్ బంధం మరింత బలపడి పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తుంది.