గురువారం నాడు ఎప్పటిలానే బిగ్ బాస్ షో వేకప్ సాంగ్ తో మొదలైంది. బాబా భాస్కర్ తన డాన్స్ తో మెప్పించారు. హౌస్ కి కెప్టెన్ గా ఉన్న శ్రీముఖిని టార్గెట్ చేస్తూ రాహుల్, వరుణ్ లు జోకులేసుకున్నారు.

శ్రీముఖి వాయిస్ ని కామెంట్ చేస్తూ.. శ్రీముఖికి పెళ్లి అయిన తరువాత కూడా అలానే అరుస్తుందేమోనని రాహుల్.. వరుణ్ తో అన్నాడు. దానికి వరుణ్ అరిస్తే వినిపించకుండా ఇయర్ ఫ్లగ్స్ కొనుక్కుంటాడేమో అని సెటైర్ వేశాడు. ఇక పునర్నవి తనను లేచిన వెంటనే ఎదవ అని తిడుతూ స్టార్ట్ చేస్తుందని రాహుల్ చెబితే దానికి వరుణ్ ఇష్టంతో తిడుతుందని అన్నారు. 

తనకు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుందని అన్నాడు రాహుల్. ఇక ఎప్పటిలానే రాహుల్ తో పునర్నవి డెటాల్ కోసం గొడవ పెట్టుకుంది. వారిద్దరి మధ్య ఎవరైనా వెళ్తే బిస్కెట్ అవుతామ్ లైట్ తీస్కో అంటూ వితికా.. కెప్టెన్ శ్రీముఖికి చెప్పింది. రాహుల్, పునర్నవిల గొడవేంటో తనకు అర్ధం కావడం లేదని, గొడవ పడి ఇప్పుడేమో ఒకరితోఒకరు సరదాగా ఉంటున్నారని బాబా భాస్కర్ వద్ద చెప్పుకొచ్చింది శ్రీముఖి.