మంగళవారం నాటి ఎపిసోడ్ లో శ్రీముఖి తనను నామినేషన్ నుండి సేవ్ చేయకపోవడంపై బాబా భాస్కర్ తో చర్చించింది. రవిని ఎలిమినేషన్ నుండి సేవ్ చేయడం తనకు షాకింగ్ గా అనిపించలేదని.. సర్ప్రైజింగ్ గా అనిపించిందని.. దాని వల్ల బాధ లేదు కానీ మీరు వచ్చి నన్ను బాధపడుతున్నావా..? అంటేనే ఫీల్ అవ్వాల్సి వస్తుందని ఎమోషనల్ అయింది.

లగ్జరీ బడ్జెట్ లో భాగంగా హౌస్ మేట్స్ కి 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో దెయ్యాలుగా బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు ఉంటారు. వీరు ఇంట్లో మిగిలిన వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రాహుల్, రవి, మహేష్‌లకు విసుగుతెప్పించాలి.మనుషులకు విసుగు తెప్పించి.. వాళ్లను చంపాలి. దీనిలో భాగంగా తొలిరోజు ముగ్గుర్ని చంపాల్సి ఉంటుంది.

ఇలా చేస్తే చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా.. చంపిన వాళ్లు మనుషులుగా మారతారు. మొదటిగా వరుణ్‌కి వితికా మూడు ముద్దులు పెట్టి బాత్రూం మిర్రర్‌పై వరుణ్ గోస్ట్ అని రాయాలని.. శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టాలని.. పునర్నవిని పూల్‌లోకి తోసేయాలని.. రవిని డాన్స్ వేసేట్టు చేయాలని.. మహేష్‌ని ఐదు సార్లు బట్టలు మార్చుకునేలా చేయాలని దెయ్యాలకు టాస్క్ ఇచ్చారు.

ఈ క్రమంలో శిల్పా.. పునర్నవిని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేసింది. దెయ్యం అయిన శిల్ప చేతిలో పునర్నవి ప్రాణాలను కోల్పోయిందని.. శిల్ప మనిషిగా, పునర్నవి దెయ్యంగా మారతారని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ రావడంతో అప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న పునర్నవి బిగ్ బాస్ పై ఫైర్ అయింది. బిగ్ బాస్ ఇది బుల్ షిట్ టాస్క్. అంటూ తనకు వస్తోన్న బూతులను కంట్రోల్ చేసుకొని.. మీ ఆటను మీరే ఆడుకోండి. నేను ఈ గేమ్ ఆడను అంటూ బిగ్ బాస్ ని ఏకిపారేసింది.