పండగ వస్తే ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో హడావుడి మొదలవుతుంది.గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి బాక్స్ ఆఫీస్ వద్ద ఫైట్ డోస్ పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా థియేటర్స్ విస్తరణలో నిర్మాతల మధ్య చర్చలు కూడా గట్టిగానే జరగనున్నాయి. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్స్ సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అరవింద్ - దిల్ రాజు నిర్మిస్తున్న పెద్ద సినిమాలు పొంగల్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు సురేష్ బాబు ప్రొడక్షన్ లో తెరక్కేకుతున్న సినిమా కూడా అదే ఫెస్టివల్ ని టార్గెట్ చేస్తోంది. అల్లు అరవింద్ నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న అల.. వైకుంఠపురములో సంక్రాంతికి రానున్నట్లు ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారు.

అలాగే దిల్ రాజు SVC ప్రొడక్షన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మహేష్ ' సరిలేరు నీకెవ్వరూ అదే సమయానికి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' కూడా అప్పుడే రానుంది.  ఇక ఇప్పుడు సీనియర్ నిర్మాత సురేష్ బాబు వెంకీ మామ సినిమాని మెల్లగా సంక్రాంతికి షిఫ్ట్ చేస్తున్నట్లు సమాచారం. వెంకటేష్ - నాగ చైతన్య.. కలిసి నటిస్తున్న ఈ ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని సురేష్ బాబు పొంగల్ ని టార్గెట్ చేసినట్లు టాక్.

అసలైతే సినిమా దసరా సమయంలోనే రావాలి.  డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకున్నారట. సంక్రాంతికి స్టార్ హీరోల మధ్య పోటీ తీవ్రత ఏ విధంగా ఉంటుందో గాని థియేటర్స్ పంచుకోవడంలో మాత్రం స్టార్ ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు వేడెక్కే అవకాశం ఉంది. మరి ఫైనల్ గా ఈ పొంగల్ లో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.