బిగ్ బోస్ రియాలిటీ షో నిన్న అట్టహాసంగా ప్రారంభం అయ్యింది.హోస్ట్  కింగ్ నాగార్జున తనదైన శైలిలో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి సాదర స్వాగతం పలికారు. భిన్నమైన ఏజ్ గ్రూప్స్ తో 16 మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్ లో సందడి చేయనున్నారు. వెండితెర, బుల్లితెర ప్రముఖులు, యూట్యూబర్స్ తో పాటు మరికొందరు బిగ్ బాస్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఐతే ఈ సీజన్లో పాల్గొన్న సభ్యులందరిలోకి ప్రేక్షకుల దృష్టి గంగవ్వ పైనే ఉంది. 

యూట్యూబ్ లో అనేక కార్యకమాలు, షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన గంగవ్వ తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. 60ఏళ్ళు పైబడిన గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. పేరుకు మాత్రమే వృద్ధురాలైన గంగవ్వకు హుషారులో మాత్రం యువకులు కూడా సరిపోరు. అలాంటి గంగవ్వ హౌస్ లో అద్భుతాలు చేయడం ఖాయం అనిపిస్తుంది. 

స్టార్ మా ట్విటర్ లో మొత్తం బిగ్ బాస్ ఇంటి సభ్యుల ఫోటోలు పోస్ట్ చేయగా, అత్యధిక లైక్స్ గంగవ్వ దక్కించుకోవడం గమనార్హం. ఇక నేడు జరుగనున్న నామినేషన్ ప్రక్రియలో గంగవ్వ చెప్పిన విషయం ఇంటి సభ్యులలో నవ్వులు పూయించింది. నామినేట్ ప్రక్రియలో భాగంగా ఒకరిని నామినేట్ చేయాలని గంగవ్వను అడుగగా, ఎవ్వరినీ నామినేట్ చేయొద్దు, అందరినీ ఉండనిద్దాం, మొన్నే కదా వచ్చిందని డిఫరెంట్ ఆన్సర్ చెప్పింది.