మరో నెలలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ 78వ ఏట అడుగిడనున్నారు. దశాబ్దాలపాటు బాలీవుడ్ ని ఏలిన అమితాబ్ ఈ వయసులో కూడా వరుసగా చిత్రాలు చేస్తున్నారు.  ఇటీవల అమితాబ్ మరియు అతని కుటుంబానికి కరోనా సోకింది. 77ఏళ్ల ప్రాయంలో ధీటుగా కరోనాను ఎదుర్కొని అమితాబ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. కోలుకున్న అమితాబ్ షూటింగ్స్ లో తిరిగి పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. 

కొద్దిరోజులలో తన పుట్టినరోజు జరుపుకోనున్న అమితాబ్ తన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. అమితాబ్ పసిబిడ్డగా ఉన్నప్పుడు దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ ఫొటోతో పాటు ప్రస్తుత అమితాబ్ ఫోటోలు పంచుకొని, పసిబిడ్డగా తనని తాను చూసి మురిసిపోతున్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. 'అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను' అని కామెంట్ చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

... that be me .. then ..😀 ... that be me .. now .. NOW ??😎

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Sep 13, 2020 at 11:32am PDT

దాదాపు రెండేళ్ల ప్రాయంలో ఉన్న అమితాబ్ చక్కగా నవ్వుతుండగా ఫొటోలో చాలా క్యూట్ గా ఉన్నారు. ఇక పసివాడిగా అమితాబ్ ఫోటో చూసి నెటిజెన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పిల్లాడిగా అమితాబ్ చాలా అందంగా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. 1969లో వచ్చిన సాత్ హిందూస్థానీ మూవీతో హీరోగా వెండితెరకు పరిచమైన అమితాబ్ యాభై ఏళ్లకు పైగా సినిమాలలో నటిస్తున్నారు. అమితాబ్ ఇటీవల నటించిన గులాబో సితాబో ప్రైమ్ లో విడుదలైంది.