అందరి అటెన్షన్ ని తమవైపుకి తిప్పుకోవటానికి సెక్స్ విషయాలైతేనే కరెక్ట్ అనుకుంటారేమో.. చాలా మంది హిరోయిన్లు, సెలెబ్స్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తూంటారు. రెండు సినిమాల్లో నటించగానే హీరోయిన్లు 'బోల్డ్' స్టేట్‌మెంట్లు ఇవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది. తమ గురించి చర్చ జరగాలని, సినిమా అవకాశాలు దక్కించుకోవాలని 'బోల్డ్'గా మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలో బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ చేరింది. ఇటీవలే విడుదలైన 'శుభ్ మంగళ్ సావధాన్', టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' చిత్రాల్లో ఈ అమ్మడు నటించింది.

 

తాజాగా ఈ బాలీవుడ్ భామ వైవాహిక జీవితం, సెక్స్ విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నభూమి ఫడ్నేకర్ పెళ్లికి ముందు సెక్స్ అత్యంత సహజమైనదని చెప్పింది. అలాగే ఇప్పుడంతా తలుపుల వెనకాల ఇది చేస్తుంటారని, ఇది పెద్ద విషయమేమీ కాదని చెప్పింది. పెళ్లికి ముందు సెక్స్ గురించి మనం దాచిపెడతామని స్టేట్‌మెంట్ ఇచ్చింది.

 

భోపాల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న భూమి పెడ్నేకర్ తన కెరియర్, నిజ జీవితానికి సంబంధించిన విషయాలు వెల్లడించింది. ముందుగా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే, మన పార్ట్‌నర్ కూడా మనల్నిఅమితంగా ప్రేమిస్తాడని పేర్కొంది.