Asianet News TeluguAsianet News Telugu

పవన్ స్టామినాకు ఇంతకు మించి సాక్ష్యం ఏముంటుంది?


ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ప‌వ‌న్ కు అభిమానులు ఉండ‌రు.. భ‌క్తులు మాత్ర‌మే ఉంటార‌ని చెబుతారు. అందుకే.. ప‌వ‌న్ ఏ మూవీ చేసినా.. ఫ్యాన్స్ మోత మోగిస్తారు. ఈ క్ర‌మంలోనే.. ‘భీమ్లా నాయ‌క్‌’ టైటిల్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. 

Bheemla Nayak audio rights sold for a bomb
Author
Hyderabad, First Published Aug 30, 2021, 3:15 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, గ్లింప్స్  వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాయి.

ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ప‌వ‌న్ కు అభిమానులు ఉండ‌రు.. భ‌క్తులు మాత్ర‌మే ఉంటార‌ని చెబుతారు. అందుకే.. ప‌వ‌న్ ఏ మూవీ చేసినా.. ఫ్యాన్స్ మోత మోగిస్తారు. ఈ క్ర‌మంలోనే.. ‘భీమ్లా నాయ‌క్‌’ టైటిల్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోతోనూ ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం…ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...మొత్తం 5.04 కోట్ల రూపాయల తో ప్రముఖ సంస్థ ఆదిత్యా మ్యూజిక్ వారు  కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప‌వ‌ర్ స్టార్ యాక్ష‌న్ తో.. భీమ్లానాయ‌క్ గ్లింప్స్ దుమ్ము లేపటమే అందుకు కారణం. మరో ప్రక్క ఈ మూవీ ఓటీటీ డీల్ ముగిసింది.  

భీమ్లానాయ‌క్ ఓటీటీ రైట్స్ ను ప్ర‌ముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఎంత చెల్లిస్తోంది అన్న ఫిగ‌ర్ బ‌య‌ట‌కు రాలేదుగానీ.. భారీ మొత్తంలో డీల్ సెట్ చేసుకున్న‌ట్టు స‌మాచారం. ప‌వ‌ర్ స్టార్ రీ-ఎంట్రీ మూవీ వ‌కీల్ సాబ్ కూడా అమెజాన్ లోనే స్ట్రీమ్ అయ్యింది. ఇప్పుడు భీమ్లానాయ‌క్ కూడా అమెజాన్ లోనే ప్లే కానుంది. అయితే.. అంత‌కు మించి అన్న రేంజ్ లో ఈ చిత్రానికి ఎక్కువే వెచ్చించిన‌ట్టు టాక్‌.

మ‌రి, థియేట్రికల్ రిలీజ్ త‌ర్వాత ఎన్ని రోజుల‌కు ఓటీటీలో రిలీజ్ చేయాల‌నే విష‌య‌మై చాలా డిస్క‌ష‌నే సాగింది. చ‌ర్చ‌ల త‌ర్వాత ఇటు మేక‌ర్స్‌.. అటు అమెజాన్ సంస్థ ఒక ఒప్పందానికి వ‌చ్చాయి. దీని ప్ర‌కారం.. సినిమా విడుద‌ల‌కానున్న జ‌న‌వ‌రి 12 త‌ర్వాత స‌రిగ్గా నెల రోజుల‌కు స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్టు సమాచారం. ప‌వ‌ర్ స్టార్ – భ‌ల్లాల దేవ పోరాటం ఏ స్థాయిలో కొన‌సాగ‌నుంది? అన్న‌ది చూడాలి. ఇక ఇందులో పవన్ సరసన నిత్యమీనన్ నటిస్తుండగా… రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.  ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios