సీనియర్ దర్శకుడు భారతీరాజా నటుడు విశాల్ పై మండిపడ్డారు. నడిగర్ సంఘం ఎన్నికలు దగ్గర పడడంతో విశాల్ ని అతడి టీమ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. విశాల్ కూడా తనదైన స్టైల్ లో వారికి సమాధానాలు ఇస్తున్నాడు.

తాజాగా దర్శకుడు భారతీరాజా విశాల్ ని పందికొక్కుతో పోల్చడం చర్చనీయాంశమైంది. నిర్మాతల మండలిలో విశాల్ వంటి పందికొక్కు దూరిందని, దాన్ని తరిమి కొట్టాలని అన్నారు. మండలిలో మొలిచిన కలుపు మొక్కను పీకేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.

నిర్మాతల మండలిలో చేరిన చీడపురుగులను తొలగించడం మన బాధ్యతేనని అన్నారు. నడిగర్ సంఘం తమిళేతరుల చేతిలో నడుస్తుండడం బాధగా ఉందని చెప్పారు. నడిగర్ సంఘానికి జరిగే ఎన్నికల్లో భాగ్యరాజా టీమ్ ని గెలిపించుకోవడం ద్వారా తమిళ నటుల ఉనికిని కాపాడుకునే అవకాశం ఉందన్నారు.

భాగ్యరాజ్ గెలవగానే దక్షిణాది నటీనటుల సంఘాన్ని తమిళ నటుల సంఘంగా మార్చాలని, నడిగర్ సంఘానికి తమిళనటుల సంఘంగా మర్చడమే తన లక్ష్యమని భారతీరాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి!