స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి బయోపిక్ ను మొత్తానికి చిత్ర యూనిట్ ఫినిష్ చేసింది. చిన్న చిన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు రేపో మాపో అయిపోతాయి. ఇక చిత్ర యూనిట్ నెక్స్ట్ టార్గెట్ మొత్తం ప్రమోషన్స్ పై పెట్టింది. సినిమాకు సంబందించిన విశేషాలను నటీనటుల ద్వారా ప్రోమోలను రెడీ చేస్తున్నారు. 

రీసెంట్ గా బాలకృష్ణ కు సంబందించిన ప్రోమో రిలీజయ్యింది. బయోపిక్ తీయాలన్న ఆలోచన మొదట ఎలా వచ్చింది అని రానా అడిగిన ప్రశ్నకు బాలయ్య సమాధానమిచ్చారు.  

'ఏడాదిన్నర క్రితం అనుకుంటా.. నిమ్మకూరు వెళ్ళినప్పుడు ఆ ఊరిని మా అల్లుడు లోకేష్ దత్తత తీసుకున్నారు. అక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్‌ని అప్‌గ్రేడ్ చేసినప్పుడు నేను కూడా ఉన్నాను. అయితే ఎందుకు నోటి నుంచి వచ్చిందో తెలియదు కానీ..యాదృచ్చికంగా అక్కడ అడుగుపెట్టగానే అనుకోకుండా.. రామారావు గారి బయోపిక్ చేద్దామనుకుంటున్నా అని నోటి నుంచి వచ్చేసింది. 

ఆ తరువాత విష్ణు గారు కూడా బయోపిక్ నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఇక స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత ఎందుకో  ఆ ఆలోచనని అలా వదిలేశాము. దాని గురించి మాట్లాడుకోలేదు. ఇక కొన్ని రోజుల తరువాత బయోపిక్ ను స్టార్ట్ చేశాం. ముందుగా అయితే స్థల పురాణం అన్నట్లుగా నిమ్మకూరులోనే యన్‌.టి.ఆర్ బయోపిక్ చేయలనే ఆలోచనే కలిగింది' అని బాలకృష్ణ వివరణ ఇచ్చారు.