కేక ఐడియా కదా:ప్రభాస్ కు పోటీగా ప్రభాస్ రీమేక్ తోనే...
బడ్జెట్ మార్కెట్ కు మించి ఉండడంతో యావరేజ్ అనుకున్నా లాభావు తెచ్చిపెట్టలేదు. అతని కెరీర్ లో కాస్త ఆడి,డబ్బులు తెచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది రాక్షసుడు మాత్రమే. అయితే ఇలా వరసపెట్టి సినిమాలు చేసుకుపోతూండంతో అతనికో కొత్త మార్కెట్ క్రియేట్ అయ్యింది. అదే హిందీ మార్కెట్.
బెల్లంకొండ శ్రీనివాస్ గత సినిమాలన్నీ కూడా చాలా వరకు యావరేజ్,బిలో యావరేజ్, డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఏదీ సరిగ్గా ఆడిన పాపాన పోలేదు. తండ్రి టాలీవుడ్ లో పేరున్న నిర్మాత కావటం, భారీ బడ్జెట్ లతో సినిమాలు తీయటం,పడిపోకుండా నిలబెట్టడం కలిసొచ్చింది. మెల్లిమెల్లిగా అతనికి తెలు ప్రేక్షకులు అలవాటుపడుతున్నారు. అయితే అతనిపై పెట్టే బడ్జెట్ మార్కెట్ కు మించి ఉండడంతో యావరేజ్ అనుకున్నా లాభావు తెచ్చిపెట్టలేదు. అతని కెరీర్ లో కాస్త ఆడి,డబ్బులు తెచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది రాక్షసుడు మాత్రమే. అయితే ఇలా వరసపెట్టి సినిమాలు చేసుకుపోతూండంతో అతనికో కొత్త మార్కెట్ క్రియేట్ అయ్యింది. అదే హిందీ మార్కెట్.
సాధారణంగా సౌత్ లో వచ్చే మాస్ మసాలా కథలకు హిందీలో మంచి మార్కెట్ ఉంటుంది.నార్త్ ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో మన మాస్ సినిమాలు విపరీతంగా ఇష్టపడుతుంటారు. నిర్మాతలు మన తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుంటారు.అలా సౌత్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు హిందీలో మంచి డిమాండ్ ఉంది. ఆ తర్వాత ఎక్కువగా హిందీ డబ్బింగ్ మార్కెట్ బెల్లంకొండ శ్రీనివాస్ కలగి ఉండటం విశేషం.యూట్యూబ్ లో అతని హిందీ డబ్బింగ్ సినిమాలు రికార్డు స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకుంటున్నాయి.
ఈ మధ్యకాలంలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా కవచం అనే సినిమా చేశాడు.అయితే ఈ సినిమా తెలుగులో ఎప్పుడు రిలీజ్ అయింది అనే విషయం కూడా చాలామందికి తెలియదు.హిందీలో ఇన్స్పెక్టర్ విజయ్ గా డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో ఉన్నారు.ఇక ఈ సినిమా ఏకంగా 200 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం గమనార్హం.
ఈ క్రమంలో ప్రభాస్‌ని మంచి మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో ఒకటైన ‘ఛత్రపతి’ (2005)ని బెల్లంకొండ శ్రీనివాస్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డైరెక్ట్ సినిమాతో హిందీ తెరపై కనిపించాలనుకున్నారు. మంచి మాస్ కథాంశంతో రూపొందిన ‘ఛత్రపతి’ రీమేక్ కోసం ఇప్పటికే ఓ ఫోటోషూట్ చేశారట సాయి. బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ఇంకా డైరక్టర్ ఖరారు కాలేదు.