టాలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరో బెల్లంకొండ శ్రీనివాస్. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా బిగ్ బడ్జెట్ సినిమాల్లో నటించే ఈ హీరో ఇటీవల రాక్షసుడు సినిమాతో ఎట్టకేలకు ఒక సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఓ రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తెచ్చిన ఈ హీరో రీసెంట్ గా మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

కందిరీగ సినిమాతో బాక్స్ ఆఫీస్ అందుకున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో రభస -  రామ్ తో హైపర్ సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఇక పవన్ కళ్యాణ్ తో ఆల్ మోస్ట్ సెట్టయిపోయింది అనుకున్న ప్రాజెక్ట్ కూడా మిస్సవ్వడంతో నెక్స్ట్ బెల్లకొండ హీరోతో సంతోష్ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

రీసెంట్ గా కథ వినిపించగా బెల్లంకొండ శ్రీనివాస్ సింగిల్ సిట్టింగ్ లో దర్శకుడికి ఒకే చెప్పినట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ స్టువర్ట్ పురం నాగేశ్వర్ రావు బయోపిక్ లో నటిస్తున్నాడు. దొంగాట దర్శకుడు వంశీ కృష్ణ తెరకెక్కిస్తున్న ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో రెండు కథలను కూడా ఈ హీరో వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం.