ఒకప్పుడు యాక్షన్ కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి,సూపర్ హిట్స్ కు కేరాఫ్ అయిన శ్రీను వైట్ల..వరస ఫ్లాఫ్ లతో వెనుకబడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా రవితేజ తో చేసిన  ‘అమర్ అక్బర్ ఆంథోనీ’డిజాస్టర్ ఆయన్ని అథపాతాళానికి తోసేసింది. దాంతో శ్రీను వైట్ల కథ చెప్తానంటే హీరోలు భయపడే స్ధితికి చేరుకుంది. ఆయన అండతో హిట్ సంపాదించుకున్న హీరోలు సైతం ప్రక్కన పెట్టేసారు. దాంతో మళ్లీ కెరీర్ మొదటికి వెళ్లి మంచు విష్ణుతో చేద్దామా అనే ఆలోచన వచ్చినా, దాన్ని తొక్కి పట్టి రాక్షసుడుతో ఫామ్ లోకి వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ వెనక పడ్డాడు.

బెల్లంకొండ శ్రీను రాక్షసుడుకు ముందు ఈ కథ నచ్చి ఓకే చేసినా ఆ తర్వాత ఆలోచనలో పడ్డాడు. తను ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా అడుగులు వేస్తున్నాడు. ఈ సిట్యువేషన్ లో ఓ కామెడీ కథ చేస్తే పరిస్దితి ఏమిటి అని డిస్కస్ చేసారట. దానికి తోడు శ్రీను వైట్ల డైరక్టర్ అంటే నిర్మాతలు సైతం ఎవరూ ముందుకు రావటం లేదు. తమ బ్యానర్ పైనే సినిమా చేయాలి. ఇది గమనించిన బెల్లంకొండ శ్రీనువాస్...తర్వాత చేద్దాం అని శ్రీను వైట్లకు మొహమాటం లేకుండా చెప్పేసాడని, దాంతో అప్ కమింగ్ హీరోలాంటి బెల్లంకొండ సైతం హ్యాండ్ ఇవ్వటం ఊహించని షాకే అంటున్నారు.

అదే సమయంలో కందిరీగ, రభస చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తను మూడు సంవత్సరాలు గా తయారు చేస్తున్న కథతో బెల్లంకొండను ఒప్పించి సీన్ లోకి వచ్చేసాడు. రక్షస, హైపర్ వంటి డిజాస్టర్స్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేస్తూ తనను ప్రక్కన పెట్టడం మాత్రం శ్రీను వైట్ల జీర్ణించుకోలేకపోతున్నాడంటున్నారు.