బాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్న డ్రగ్స్ విచారణ కేసు ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు బయటకు రావడం కలకలం రేపింది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చింది.   జాతీయ మీడియా .. నార్కోటిక్స్ బ్యూరో అధికారుల విచారణలో దొరికిన వ్యక్తుల వాట్సాప్ చాట్ లో నమ్రత పేరు ఉందనే  కథనాలు వెలువరించింది. దీంతో మిగతా మీడియా మొత్తం ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున క్యారీ చేసింది.

 ఇదంతా టాలీవుడ్ ని షాక్ కు గురి చేసింది.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నా...నిజా నిజాలు ఎలా ఉన్నా..సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరో ప్రక్క మహేష బాబు అభిమానులు సోషల్ మీడియాలో ఈ అనాధారిత ఆరోపణలను, వార్తలను తీవ్రంగా ఖండించారు. తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష రియాక్ట్ అవుతూ ‘నమ్రత నాకు 15 ఏళ్లుగా తెలుసు. ఆమె ఎంతోమంది మహిళలకు స్పూర్తిదాయకమైన వ్యక్తి. ఆమె ఒక గొప్ప భార్య, గొప్ప తల్లి. ఆమెను నేను గౌరవిస్తాను’ అంటూ ట్వీట్ చేశారు.

  కొన్నిరోజుల క్రితం స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఆమె నేరుగా ఢిల్లీ వెళ్ళి తనపై మీడియాలో జరుగుతున్న అనాధారిత ప్రచారాన్ని నిలిపివేసేలా మీడియాకు ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు. కోర్టు ఆమెకు అనుకూలంగానే తీర్పునిచ్చింది.