కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యాలయాల్లో ఆయన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ కు ఎంతో మంది ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో జీవించాలంటూ రాహుల్ కు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి మీరు మాత్రమే భవిష్యత్తు అంటూ ట్వీట్ చేశారు.