క్యారక్టర్ ఎక్కిందంటే... ప్రాణం పెట్టేస్తారు బాలకృష్ణ అని ఆయనతో పనిచేసిన వారు చెప్తూంటారు. అయితే కొన్ని సార్లు అవి మిస్ ఫైర్ అవుతూంటాయి. అందుకు రకరకాల కారణాలు ఉండచ్చు. ముఖ్యంగా డైరక్టర్ ఎలా చెప్తే అలా తూచ తప్పకుండా చేసుకుంటూ పోయే హీరో. సెట్ కు వెళ్లే ముందే ఆయన అన్ని ఫైనలైజ్ చేసుకుంటారు. ఒక్కసారి సెట్లో అడుగుపెట్టాక అదో దేవాలయంగా భావించి మెలుగుతూంటారని చెప్పుకుంటారు. అయితే రీసెంట్ గా బాలయ్య సెట్లో గడబిడ చేసుకుందని వార్తలు మొదలయ్యాయి. అసలేం జరిగింది అనేది మీడియాలోనే కాక అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే..నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చాలా రోజుల కిందే లాంచ్ అయినా రకరకాల కారణాల వల్ల షూటింగ్  మొదలుకాలేదు.కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ డైరెక్షన్‌లో యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్ర టీమ్ చిత్రీకరిస్తోంది. ఇక్కడ షూటింగ్ పూర్తిచేసుకొని త్వరలోనే వారణాశిలో  కూడా వెళ్లనున్నారు. ఇక ఈ చిత్రం సెట్ లో బాలయ్య చాలా అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అందుకు కారణం బాలయ్య చెప్పిన వాళ్లనెవరినీ దర్శకుడు బోయపాటి శ్రీను తీసుకోలేదట. ఈ సినిమా కు అందరూ హై ఎండ్ టెక్నీషియన్స్ ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడట. ముఖ్యంగా హెయిర్, మేకప్ విషయంలో తను నమ్మిన వాళ్లనే సీన్ లోకి తెచ్చారట. దాంతో బాలయ్య చాలా అన్ కంఫర్ట్ గా ఫీలవుతున్నాడట. అయితే బోయపాటి ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు అని ముందే చెప్పి ఒప్పించి షూట్ స్టార్ట్ చేసారట. దాంతో బాలయ్య ఏమీ అనలేక అందరిపై చిరాకు పడుతున్నారట.  అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది ప్రక్కన పెడితే...షూటింగ్ మాత్రం చాలా వేగంగా జరుగుతోంది. షూటింగ్ అన్నాక ఏవో చిన్న చిన్న చిరాకులు, పరాకులు లేకుండా అయితే ఉండవు. బూతద్దంలో చూడటం మొదలెడితే అన్నీ పెద్దవిగానే కనపడతాయి.  

 దీనికితోడు బాలయ్య తాజా చిత్రం రూలర్ అనుకున్నంతగా  అలరించలేదు. దీంతో బాలయ్య అభిమానులు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ’ ఆ తర్వాత ‘లెజెండ్’ మంచి విజయాన్ని పొందాయి. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

ఇక కేయస్ రవికుమార్ దర్శకత్వంలో చేసిన రూలర్ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. సింహా , లెజెండ్ సినిమాల తరవాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక సింహా , లెజెండ్ సినిమాలలో లాగే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించనున్నారని తెలుస్తోంది. అందులోనూ ఓ పాత్ర వారణాశి సమీపంలో ఉండే అఘోరాదిని తెలుస్తోంది.