బాలకృష్ణ కేవలం నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడుగానూ పేరున్నవాడు. తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న నలుగురు పెద్ద స్టార్స్ లో ఒకరు. హిందూపర్ ఎమ్మల్యే కూడా. ఈ నేపధ్యంలో ఆయనకు సినిమాల పరంగా ప్రత్యర్దులు లేకపోవచ్చు కానీ, రాజకీయంగా ఉన్నారు...ఖచ్చితంగా ఉంటారు. ఈ నేపధ్యంలో ఆయన వ్యతిరేక మీడియా బాలయ్యను టార్గెట్ చేస్తూంటుంది. మరీ ముఖ్యంగా ప్రపంచం అంతా కరోనా వైరస్ అలజడిలో ఉన్న సమయంలో ఎక్కడా బాలయ్య మాట వినపడకపోవటం ఆయనపై దాడికి తావిస్తోంది.

మిగతా టాప్ హీరోలంతా సీఎం రిలీఫ్ ఫండ్ కు, సిసిసి (పేద సినిమా పనివాళ్ల కోసం పెట్టిన నిథి)కు సపోర్ట్ చేస్తూ విరాళాలు ఇస్తూంటే ఆయన సైలెంట్ గా ఉంటున్నారనేది విమర్శ. బాలయ్య ఎక్కడా తన వంతు విరాళం ప్రకటించలేదని, అసలు ధైర్యం చెప్పటానికి ఓ వీడియో కూడా రిలీజ్ చెయ్యలేదని అంటున్నారు. మిగతా ఎమ్మల్యేలు అంతా ఓ నెల జీతం సిఎం రిలీఫ్ ఫండ్ కు డొనేషన్ ప్రకటిస్తే..బాలయ్య ఎక్కడా ఓ మాట కూడా మాట్లాడటం లేదని విమర్శిస్తున్నారు.
 
ప్రత్యర్ది మీడియా మరో అడుగు ముందుకేసి..బాలయ్యకు జాతకాలు అంటే నమ్మకం కాబట్టి, ఇంట్లో కూర్చుని ఈ కరోనా పరిస్దితుల నివారణకు జపాలు చేస్తున్నారని వెటకారం చేస్తున్నారు.  అయితే బాలయ్య నిజానికి ఇలాంటి న్యూస్ లు పట్టించుకునే రకం కాదు. ఆయన చేయాలనుకున్నది చేసేస్తారు.

 ఆయన తమ కాన్సర్ హాస్పటిల్ రోగులకు...ఇలాంటి కీలకమైన సమయంలో ఏమీ జరగకుండా చూస్తానని హామీ ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఆయన విరాళాలు ప్రకటిస్తారో ...ఎవరు చూడవచ్చారు, ఇలా వెటకారం చెయ్యటం పద్దతి కాదు అంటున్నారు అభిమానులు.