టర్కీలో కీలక షెడ్యూల్ పూర్తి చేయనున్న బాలయ్య, ఫారెన్ టూర్ కు డేట్ ఫిక్స్

బాలయ్య ఫారెన్ టూర్ కు రెడీ అవుతున్నాడు. కీలక షెడ్యూల్ కోసం అరబ్బ్ దేశాలకు పయనం కానున్నాడు బాలకృష్ణ. విదేశీ ప్రయాణానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడట నందమూరి నటసింహం. 
 

Balakrishna team turkey Schedule Date Fix

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నంద‌మూరి హీరో బాల‌కృష్ణ.   ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేషన్ లో యాక్షన్ డ్రామామూవీ చేస్తున్నాడు. ఇప్పటివరకూ టైటిల్ ఖరారు చేయని ఈసినిమా..ఎన్‌బీకే107 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. సూపర్ ఫాస్ట్ గా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య స్లో అయ్యింది. ఇక ఇప్పుటి నుంచి పరుగులు పెట్టించాలని చూస్తున్నారు మూవీ టీమ్. అందులో భాగంగా.. ఈ సినిమాపై కొత్త అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

బాలయ్య సినిమా  షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా  పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలోని కీలక షెడ్యూల్ కోసం మూవీ టీమ్ ఫారెన్ కు బయలుదేరుతున్నారు.  ఈసినిమాలో నెక్ట్స్ షెడ్యూల్ కోసం బాల‌కృష్ణ టీం ట‌ర్కీకి ప‌యనం కానుంద‌ని టాక్‌. ఆగ‌స్టు 25న గోపీచంద్ మ‌లినేని, బాల‌కృష్ణ టీం ట‌ర్కీకి బ‌య‌లుదేర‌నుంద‌ట‌. ఈ షెడ్యూల్‌లో సినిమాకు హైలెట్ కానున్న యాక్ష‌న్ సీన్స్ ను  షూట్ చేయ‌నున్నారు. దీనికి కోసం అంతా సిద్ధం అయినట్టు తెలుస్తోంది. 

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా  కోలీవుడ్ భామ శృతిహాస‌న్ లో న‌టిస్తోంది. అఖండ సినిమా అఖండ విజయం తరువాత బలయ్యలో జోష్ పెరిగింది. ఇక అఖండ సినిమా బిజీమ్ కు ఫిదా అయిన బాలకృష్ణ.. ఈసినిమాకు కూడా  థ‌మ‌న్ నే తీసుకున్నారు.  మ‌రోసారి బాలయ్య సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడుతమన్. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోలో గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ తో అద‌ర‌గొట్టేస్తున్నాడు బాల‌య్య‌. 

అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈసినిమాలో స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. క‌న్న‌డ స్టార్ యాక్ట‌ర్ ధునియా విజ‌య్ బాలయ్యకు ఆపోజిట్ రోల్ లో..  విల‌న్‌గా న‌టిస్తున్నారు.  ఈ ప్రాజెక్టులో వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్ కీ రోల్ చేస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈసినిమా రాయ‌లసీమ బ్యాక్‌డ్రా స్టోరీతో తెరకెక్కుతోంది. అంతే కాదు రాయలసీమలో  జ‌రిగిన‌ వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌ ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios