బాలయ్య కోసం 'ఏకే 47'!

balakrishna's new movie titled as ak 47
Highlights

మీరు వింటున్నది నిజమే.. బాలయ్య కోసం 'ఏకే 47' రెడీ చేస్తున్నారు. దీనికోసం బాలయ్య కూడా 

మీరు వింటున్నది నిజమే.. బాలయ్య కోసం 'ఏకే 47' రెడీ చేస్తున్నారు. దీనికోసం బాలయ్య కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ ఏకే 47 ఏంటి అనుకుంటున్నారా..? ఇది ఆయన సినిమా కోసం రిజిస్టర్ చేయించనున్న టైటిల్. నందమూరి బాలకృష్ణ.. దర్శకుడు వివి వినాయక్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఫ్యాక్షన్ జోనర్ లో ఈ సినిమాను రూపొందించనున్నారు. రాయలసీమకు చెందిన ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ ఈ సినిమాలో కనిపించబోతున్నారని సమాచారం. అతడి క్యారెక్టర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. కథ ప్రకారం సినిమాకు 'ఏకే 47' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని దర్శకుడు వినాయక్ భావిస్తున్నాడు.

నిర్మాత సి.కళ్యాణ్ తో ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఆయన ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ.. దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్ లో నటించనున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత వినాయక్ సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  

loader