ఇప్పటికీ బాలకృష్ణకు ఓ వర్గంలో ఇంకా క్రేజ్ ఉంది అంటే అందుకు కారణం ఆయన తీసుకునే డెసిషన్స్ అని చెప్పాలి. కొత్తతరం దర్శకులు, పాత తరం దర్శకులు ఇద్దరితోనూ సమంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళటం ఆయనకు కలిసొస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం చేస్తున్న బాలకృష్ణ మరో డైరక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు అనీల్ రావిపూడి.

కెరీర్ ప్రారంభం నుంచి వరస హిట్స్ తో దూసుకుపోతున్న అనీల్ రావిపూడి..సరిలేరు నీకెవ్వరు చిత్రంతో టాప్ పేస్ లోకి వెళ్లారు. ఆయనతో చేయటానికి యంగ్ హీరోలంతా సిద్దంగా ఉన్నారు. అయితే అనీల్ రావిపూడి దృష్టి మాత్రం బాలయ్యతో ఉంది. తన దగ్గర ఉన్న స్క్రిప్టుకి బాలయ్య అయితే ఫెరఫెక్ట్ గా న్యాయం చేస్తారని నమ్ముతున్నారు. ఈ మేరకు గత కొద్ది కాలంగా తన టీమ్ తో కలిసి ఓ కథను రెడీ చేసారని, దాన్ని బాలయ్యకు లాక్ డౌన్ కు ముందే చెప్పి ఓకే చేయించుకున్నారని చెప్తున్నారు.

ఫస్టాఫ్ పూర్తి ఫన్ తో సెకండాఫ్ యాక్షన్ తో కూడిన స్క్రిప్టు అని వినిపిస్తోంది. ఓ విభిన్నమైన పాయింట్ ని, బాలయ్య గత చిత్రాల తరహాలో డీల్ చేస్తారని చెప్తున్నారు. ఆయన సూపర్ హిట్స్ అయిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు తరహాలో ఉండే కథే అయినా వాటిల్లో కనపడని ఫన్ ఈ సినిమాలో చోటు చేసుకుంటుందని, అదే సమయంలో బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు నచ్చేలాగా కథనం చేస్తున్నారట.
 
ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.  ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించిన టీజర్‌ను వదిలారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.