Asianet News TeluguAsianet News Telugu

Balakrishna: ఏదైనా మాతోనే... బాల్యయ్యవి అవే గొప్పలు... ఇక మారవా మానవా!


సందర్భం ఏదైనా బాలయ్య వంశం మూలాల నుండి ఎత్తుకుంటాడు. ఆరోజుల్లో నాన్నగారు అంటూ ఓ రాగం అందుకుంటారు. బాలయ్య గొప్పలు అనేక తిప్పలు తెచ్చిపెడుతూ ఉంటాయి. పలుమార్లు బాలయ్య వ్యాఖ్యలు విమర్శలపాలు కావడం జరిగింది... ఆయన మరోసారి ఇదే తరహా కామెంట్స్ చేశారు. 

balakrishna never change in latest comments he elevates him and his family
Author
First Published Aug 14, 2022, 7:45 PM IST


కళ్యాణ్ రామ్(Kalyan Ram) లేటెస్ట్ మూవీ బింబిసార(Bimbisara) సూపర్ హిట్ అయ్యింది. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం 9 రోజుల్లో రూ. 24 కోట్లకు పైగా షేర్ సాధించింది. కేవలం రూ. 16 నుండి 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన చిత్రం మంచి లాభాలు పంచుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ(Balakrishna)తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు బింబిసార చిత్రాన్ని ప్రత్యేకంగా చూశారు. మూవీ చూసిన అనంతరం బాలయ్య చేసిన కామెంట్స్ గొప్పలు తలపించాయి. 

సినిమా చాలా బాగుంది. బాబాయిగా నీకు నా ఆశీస్సులు, అలాగే అన్నయ్య హరికృష్ణ ఆశీస్సులు కూడా ఉంటాయి. మంచి సినిమా తీశారు. ప్రేక్షకులు సినిమాను ఆదరించి తెలుగువారని నిరూపించుకున్నారు, అన్నారు. అలాగే దర్శకుడు వశిస్ట్ ని ఉద్దేశిస్తూ.. సినిమా బాగా తీశావయ్యా, మనం కలిసి మూవీ చేద్దాం. సాధారణంగా ఒకటి రెండు చిన్న చిత్రాలు చేసిన తర్వాత పెద్ద చిత్రాలు చేస్తారు. నువ్వు డెబ్యూ మూవీతోనే పెద్ద చిత్రం చేశావు. 

అసలు అలాంటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గొప్పోడు. నందమూరి వారు ఎప్పుడూ అంతే యంగ్ టాలెంట్ ని ఆదరిస్తాము. బింబిసారతో ఎన్టీఆర్ రామారావు ఒరవడి కొనసాగించారు. ఆయనతోనే ఏదైనా ప్రారంభమైంది, ఏదైనా మాతో ప్రారంభం కావాల్సిందే అంటూ... మరోసారి తమను తమ కుటుంబాన్ని వీర లెవెల్ లో ఎలివేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో ఎందరో స్టార్స్, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నప్పటికీ బాలయ్య తరహాలో గొప్పలు చెప్పుకోరు. 

తమను తాము పొగుడుకుంటే పర్లేదు, కొన్ని సందర్భాల్లో బాలయ్య ఇతరులను ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో సక్సెస్ కావడం గురించి మాట్లాడుతూ మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు. చిరంజీవి, అమితాబ్ లాంటి వాళ్ళు ఎన్టీఆర్ లా పాలిటిక్స్ లో సక్సెస్ కావాలని చూసి ఫెయిల్ అయ్యారని బాలయ్య ఎగతాళి చేయడం విమర్శలకు దారి తీసింది. బాలయ్య చేసిన ఆ కామెంట్స్ కి 2019 ఎన్నికలకు ముందు నాగబాబు ఓ సిరీస్ ఆఫ్ వీడియోలు చేసి మరీ తీవ్రంగా విమర్శించారు.  నాగబాబు ఎన్ని వీడియోలు చేసినా బాలకృష్ణ మాత్రం స్పందించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios