నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కళ్యాణ్ రామ్ 2003లో తొలిచూపులోనే చిత్రంతో హీరోగా మారాడు. సురేందర్ రెడ్డి దర్శత్వంలో వచ్చిన అతనొక్కడే మూవీతో కళ్యాణ్ రామ్ కు ఫస్ట్ బ్రేక్ లభించింది. కళ్యాణ్ రామ్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం అది. 

అతనొక్కడే తర్వాత కళ్యాణ్ రామ్ మరిన్ని చిత్రాల్లో నటించాడు. అప్పుడప్పుడూ కొన్ని విజయాలు తప్ప కళ్యాణ్ రామ్ కెరీర్ అంత జోరుగా సాగడం లేదు. ఆ మధ్యన వచ్చిన పటాస్ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. ఆ తర్వాత మరోసారి ఫ్లాపులు మొదలయ్యాయి. 

ఎమ్మెల్యే, నా నువ్వే లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. ఈ ఏడాది కళ్యాణ్ రామ్ డిఫెరెంట్ గా ట్రై చేసి 118 లాంటి థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఈ ప్రయోగం ఫలించింది. 118 చిత్రం మంచి విజయం సాధించింది. ఇకపై కథల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. 

గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. 

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్యన విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఈ సాంగ్ లో  నటాషా దోషి మెరవనున్నట్లు తెలుస్తోంది. నటాషా జైసింహా చిత్రంలో బాలయ్య సరసన ఆడిపాడింది.