Asianet News TeluguAsianet News Telugu

`బాహుబలి`కి స్మిత ట్రిబ్యూట్‌.. రికార్డ్ వ్యూస్‌తో సంచలనం

`బాహ కిలిక్కి` పేరుతో ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌ని రూపొందించిన స్మిత.. ఇందులో `బాహుబలి`లో ఫేమస్‌ లాంగ్వేజ్‌ `కిలికిలి` భాష ఆధారంగా రూపొందించారు.  తాజాగా ఇది ఏకంగా పది కోట్ల వ్యూవర్స్ తో దూసుకుపోతుంది. 

baha kilikki video song created by smitha explodes with record views
Author
Hyderabad, First Published Sep 12, 2020, 3:18 PM IST

పాప్‌ సింగర్‌ స్మిత రెగ్యులర్‌గా స్పెషల్‌ వీడియోస్‌ రూపొందిస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌ని రూపొందించింది. అది వీడియో సాంగ్‌ల  హిస్టరీలోనే ఓ డిఫరెంట్‌ సాంగ్‌ కావడం విశేషం. తాజాగా ఇది రికార్డ్ సృష్టించింది. 

`బాహ కిలిక్కి` పేరుతో ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌ని రూపొందించిన స్మిత.. ఇందులో `బాహుబలి`లో ఫేమస్‌ లాంగ్వేజ్‌ `కిలికిలి` భాష ఆధారంగా రూపొందించారు. ఇది `బాహుబలి` సినిమా టైమ్‌లోనే రూపొందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. తాజాగా ఇది ఏకంగా పది కోట్ల వ్యూవర్స్ తో దూసుకుపోతుంది. 

సినీ చరిత్రలోనే ఓ రీజనల్‌ సాంగ్‌ ఈ రేంజ్‌లో వ్యూస్‌ని పొందడం ఇదే మొదటి సారి. దీంతో ఇది సరికొత్త రికార్డులకు తెరలేపింది. పది కోట్ల వ్యూస్‌ని పొందిన సందర్భంగా స్మిత ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఇందులో `బాహుబలి`లో విలన్‌గా నటించి కిలికిలి భాషతో ఆకట్టుకున్న ప్రభాకర్‌ కనిపించడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios