సాధారణంగా దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత ఏదైనా అనుకుంటే...అది ఖచ్చితంగా జరిగితీరుతుంది. ఎందుకంటే హీరోలు సాధారణంగా ఆయన చెప్పిన మాటను కాదనరు. ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. ముఖ్యంగా సూపర్ స్టార్స్ కాని వారితో అసలు సమస్యే లేదు. ఆయన బ్యానర్ లో సినిమా చేస్తే చాలు అని భావిస్తూంటారు. అయితే దిల్ రాజు కూడా కొందరికి కలిసి రాడు. చాలా కాలం క్రితం జోష్ అంటూ నాగ చైతన్యని పరిచయం చేస్తూ ఓ సినిమా చేసాడు. అది డిజాస్టర్.

 ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.  అయితే చైతుకు అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చాం కదా...కాబట్టి ఓ పెద్ద హిట్ ఇచ్చి  లెక్కలు సరిచేసుకుందామనుకున్నాడు. అందుకు కొన్ని కథలు చైతు దగ్గరకు పంపాడు. కానీ దిల్ రాజు పంపిన కథలేమీ చైతుకు నచ్చలేదు. దాంతో ఇలా కాదు...సేఫ్ జోన్ లో ఉంటుందని ఓ బాలీవుడ్ రీమేక్ సెట్ చేద్దామనే ప్రయత్నం చేసాడు. ఆ సినిమా మరేదో కాదు బధాయి హో. 

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ “బధాయి హో “తెలుగు రీమేక్ మూవీ చేయాలని దిల్ రాజు చాలా కాలంగా రైట్స్ తీసుకుని ఎదురుచూస్తున్నాడు. 29 కోట్ల తో రూపొందిన కామెడీ డ్రామా “బధాయి హో” హిందీ మూవీ 221 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో తెలుగులోనూ ఈ సినిమా ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావించాడు. అయితే ఇప్పుడు తను అలాంటి సినిమాలు చేసే మూడ్ లో లేనని, వేరే కథ చేద్దామని, చైతూ క్లియర్ గా చెప్పినట్లు సమాచారం. దాంతో ఆ రీమేక్ ని దిల్ రాజు ప్రక్కన పెట్టేసినట్లు సమాచారం. అయితే చైతు ఇలా లాస్ట్ మినిట్ లో ట్విస్ట్ ఇస్తాడని ఊహించని దిల్ రాజు షాక్ తిన్నాడని అంటున్నారు.