బాలీవుడ్ కుర్ర హీరో ఆయుష్మాన్ ఖురానా మొదటి నుండి ప్రయోగాత్మక కథలు ఎన్నుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'అంధాదూన్' సినిమాలో గుడ్డివాడిగా, ఇటీవల విడుదలైన 'డ్రీమ్ గర్ల్'లో అమ్మాయి పాత్రలు పోషించిన ఆయుష్మాన్ ఇప్పుడు మరో కొత్త పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు.

ఆయుష్మాన్ ప్రధాన పాత్రలో ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఈ హీరో గే పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం వీడియోను యానిమేటెడ్ వీడియోను విడుదల చేసింది. రెండేళ్ల క్రితం బాలీవుడ్ లో వచ్చిన ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’కి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

హితేశ్ కేవల్య దర్శకత్వం వహించనున్నారు. జితేంద్ర కుమార్, గజరాజ్ రావ్, నీనా గుప్తా కీలక పాత్రలు పోషించనున్నారు. నేషనల్ అవార్డు అందుకున్న ఆయుష్మాన్ 'గే' క్యారెక్టర్ లో నటించడమంటే పెద్ద సాహసమే చెప్పాలి. కానీ అభిమానులు మాత్రం ఆయుష్మాన్ ని డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూడాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ సాహసం చేయడానికి సిద్ధమయ్యాడు. 2020 మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.