Asianet News TeluguAsianet News Telugu

చెల్లి పాత్రలో అవికాగోర్, హీరో ఎవరంటే...

 చివరగా అవికా గోర్ రాజు గారి గది 3 సినిమాలో కనిపించారు. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ చెల్లి పాత్రలో కనిపించనుందని సమాచారం. 
 

Avika Gor Turns sister For Naveen Chandra
Author
Hyderabad, First Published Aug 9, 2021, 6:20 PM IST

హిందీలో బాలికావధు.. తెలుగులో చిన్నారి పెళ్లికూతురిగా అలరించిన  సీరియల్ ఎంత పెద్ద హిట్ అయ్యిదో అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఎనిమిమిది సంవత్సరాలు సాగిన ఈ సీరియల్ ఎంఆర్‌పి రేటింగ్‌ల్లో కూడా రికార్డు సృష్టించింది. ఈ సీరియల్‌తోనే అవికాగోర్‌ బాల నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం చేసింది. రాజుగారి గది, ఎక్కడికి పోతావు చిన్నవాడు, సినిమా చూపిస్తా మావా, లక్ష్మీ రావా మా ఇంటికి సినిమాలు చేసింది. అయితే మెల్లిమెల్లిగా ఆమె సినిమాలు తగ్గటం మొదలయ్యాయి..ప్లాఫ్ లు పలకరించటం మొదలెట్టాయి. . చివరగా అవికా గోర్ రాజు గారి గది 3 సినిమాలో కనిపించారు. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ చెల్లి పాత్రలో కనిపించనుందని సమాచారం. 

బ్రో అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో వారు ఆమె చెల్లిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇటీవల టాప్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన అవికా గౌర్ ఈ సినిమాలో నవీన్ చంద్రకు చెల్లి పాత్రలో కనిపించబోతుంది. అన్నా చెల్లిల మద్య ఉండే అనుబంధం మరియు ఇద్దరు మద్య ఉండే కొన్ని ప్రత్యేకమైన ఎమోషన్స్ ను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించబోతున్నారట. ఈ సినిమా లో నవీన్ చంద్ర మరియు అవికా ల నటన కూడా చాలా బాగుంటుందని.. తప్పకుండా అందరిని ఆకట్టుకునే విధంగా వీరి పాత్రలు ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

కార్తీక్ త్రిపురనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను జే జే ఆర్ రవిచంద్రన్ నిర్మిస్తున్నాడు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాలో అన్నా చెల్లి పాత్రలను మాత్రమే రివీల్ చేయడం జరిగింది. వీరిద్దరికి జోడీ ఎవరైనా ఉంటారా లేదా మొత్తం కథ వీరి పైనే కొనసాగుతుందా అనే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా  మొదటి కాపీ సిద్దం అవుతుందని.. విడుదల విషయాన్ని అతి త్వరలోనే ప్రకటిస్తామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

అలాగే త్వరలో చిన్నారి పెళ్లి కూతురు సీజన్‌ 2 రాబోతుంది. ఇందులో కూడా అవికాగోర్‌ నటించనున్నట్లు సమాచారం. అయితే అవికాగోర్‌ ప్రధాన పాత్రలో నటించడం లేదట. దీనిపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ముందుగా ఒప్పుకున్న సినిమాల వల్ల ఇందులో ప్రధాన పాత్రలో నటించలేకపోతున్నాను. అయితే అందరికీ గుర్తుండిపోయేలా ఓ కీలక పాత్రలో నటిస్నున్నా. మళ్లీ ఈ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువ కావడం ఆనందంగా ఉంది' అని అన్నారు.

చిన్నారి పెళ్లి కూతురు సీజన్‌ - 2లో ఆనంది, జగదీష్‌ పాత్రల్లో శ్రేయా పటేల్‌, వంశ్‌ సయూని నటిస్తున్నారు. ఈ సీరియల్‌ ఆగస్టు 9 నుంచి ప్రారంభకానున్నట్లు సమాచారం. అవికాగోర్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. తాను నటించిన సినిమాల్లో ఒక్కటీ హిట్‌ కొట్టలేదు. ఈమె నటిగానే కాదు.. ఓ తెలుగు సినిమాకు నిర్మాతగానూ మారారు. మరి రాబోయే రోజుల్లో నటిగా, నిర్మాతగా తనకు అదృష్టం ఎలా ఉండబోతుందో చూడాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios